రాష్ట్రీయం

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి విజ్ఞప్తి చేశారు. రుషీకేష్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సాధువుల సమావేశంలో మాట్లాడుతూ, గోవులు అనేక విధాలుగా మనుషులకు ఉపయోగపడుతున్నాయని, పాలతో పాటు, గోమూత్రం, గోపేడ అనేక రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. భారతీయ సంప్రదాయంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
సాధువులు కేవలం రుషీకేష్‌కే పరిమితం కావద్దని, వీరు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గోసంరక్షణ, హిందూధర్మ పరిరక్షణ కోసం పనిచేయాలని సూచించారు. రుషీకేష్‌లో దండిస్వాములకు ఆదరణ, అభిమానం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. హైందవ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో అడిగి తెలుసున్నారు. చాతుర్మాస దీక్ష కోసం స్వరూపానందేంద్ర స్వామితో పాటు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి రుషీకేష్ వచ్చారు. చాతుర్మాస దీక్ష సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు పీఠాధిపతులకు నూతన వస్త్రాలను పంపించారు. వీటిని రాజ్యసభ సభ్యులు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌లు కలిసి పీఠాధిపతులకు అందచేశారు. తెలంగాణ కార్మిక మంత్రి సిహెచ్ మల్లారెడ్డి దంపతులు స్వామివారి నుండి ఆశీస్సులు తీసుకున్నారు. 2020 జనవరి 2 నుండి జనవరి 5 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాల్గొనాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరగా, స్వామివారు అంగీకరించారు.
చిత్రం...సాధుసంతులతో మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర