రాష్ట్రీయం

మున్సిపల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కొత్త మున్సిపల్ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. దీనిని శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెడతారు. మున్సిపల్ చట్టం-1965, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1994 స్థానంలో కొత్త బిల్లును రూపొందించగా, దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శాసనసభ ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో కొత్త మున్సిపల్ బిల్లు ఆమోదంతో పాటు ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను మంత్రిమండలి ఆమోదించింది. వీటిని కూడా ఇదే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఇలాఉండగా మంత్రి మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితరులకు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపునకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూన్ 2019 నుంచి పెంచిన పెన్షన్లను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పెంచిన
మొత్తాన్ని లబ్ధిదారులకు ఈనెల 20 నుంచి అందజేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ రోగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 1000 పెన్షన్‌ను ఇక నుంచి రూ. 2016కు పెంచింది. అలాగే, దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇస్తున్న రూ. 1500 పెన్షన్‌ను ఇక నుంచి రూ. 3016కు పెంచింది. పెంచిన పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను ఈనెల 20 నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్‌పీ చైర్మన్లు పాల్గొనాలని సూచించింది. ప్రొసీడింగ్స్ పంపిణీకి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ కార్యక్రమం ముగిసాక లబ్ధిదారుల ఖాతాలో పెంచిన పెన్షనను జమ చేస్తారు. వృద్ధాప్య పెన్షన్ పొందడానికి ఇప్పటివరకూ ఉన్న 65 ఏళ్ల వయో పరిమితిని 57 సంవత్సరాలకు కుదించాలని మంత్రిమండలి నిర్ణయించింది. తగ్గించిన వయో పరిమితి మేరకు వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. అలాగే, బీడీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌కు విధించిన కటాఫ్ డేట్‌ను తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. జూలై 17, 2019 వరకు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న కార్మికులు అందరికీ పెన్షన్ వర్తింప చేయాలని నిర్ణయించింది.