ఆంధ్రప్రదేశ్‌

పండగ... మాకు దండగే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ‘నేను నిద్రపోను.. మిమ్నల్ని నిద్రపోనివ్వను’ అని పదే పదే అధికారులను హెచ్చరించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటల్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు బేజారవుతున్నారు. ‘పేరుకే సెలవలు...మాకన్నీ పని దినాలే’నంటూ వాపోతున్నారు. 14వ తేదీ అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి కాబట్టి, రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులంతా గురువారం విధులకు హాజరయ్యారు. శుక్రవారం శ్రీరామ నవమి. సెలవు రోజే. కానీ శుక్రవారం కూడా టెలికాన్ఫరెన్స్ పేరుతో ఉదయమే పిలుపు వచ్చింది. అధికారులంతా ఆదరాబాదరా ఆయా జిల్లా కలెక్టరేట్లకు చేరుకున్నారు. గంటల తరబడి సాగిన టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. తమకు వారంతపు సెలవు కూడా దొరకడం లేదని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాల్సింది సూటిగా చెప్పేస్తే, తమ విధులు తాము నిర్వహించుకుంటాం కదా అని వారు అంటున్నారు.