రాష్ట్రీయం

మళ్లీ నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఆల్మట్టి దాదాపు నిండింది. కాని ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షాలు నిలిచిపోయాయి. దీంతో ఆల్మట్టి గేట్లను మూసివేశారు. ఊహించని పరిస్థితి తలెత్తడంతో దిగువ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలోని జలాశయాల ఆయకట్టు రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే దాదాపు జూలై నెల కూడా ముగుస్తోంది. తెలంగాణలో 63 శాతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఇక్కడ వర్షాలు లేవు. అలాగే ఆంధ్రాలో 37 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఎడారిని తలపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆల్మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీ. ఇంతవరకు 119 టీఎంసీ నీరు చేరింది. వర్షాలు కొనసాగినట్లయితే, మరో రెండు మూడురోజుల్లో నిండేది. కాని వర్షాలు నిలిచిపోవడంతో నీటిని సంరక్షించేందుకు ఆల్మట్టి గేట్లను మూసివేశారు. దిగువకు కేవలం 128 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఆల్మట్టిలోకి 19వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువున ఉన్న నారాయణ్‌పూర్‌లో 37.65 టీఎంసీకి 33.55 టీఎంసీ నీరు చేరింది. కర్నాటక ప్రాజెక్టుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. తుంగభద్రలో 100 టీఎంసీకి 16 టీఎంసీ నీరు చేరింది. ఆ తర్వాత వర్షాలు తగ్గిపోవడంతో ఐదు వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. జూరాలలో 9.66 టీఎంసీకి 1.85 టీఎంసీ నీరు ఉంది.
ప్రస్తుతం శ్రీశైలంలో 215.81 టీఎంసీకి 31.53 టీఎంసీ నీరు, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీకి 126.47 టీఎంసీ నీరు అందుబాటులో ఉంది. శ్రీశైలంకు జూరాల నుంచి ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. దిగువకు నీటి బొట్టు పోవడం లేదు. పులిచింతల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడ 45.77 టీఎంసీకి కేవలం 0.79 టీఎంసీ నీటి లభ్యత ఉంది. ఆంధ్రాలోని సోమశిలలో 78 టీఎంసీకి 2.37 టీఎంసీ, కందలేరులో 68.03 టీఎంసీకి 3.90 టీఎంసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 16.95 టీఎంసీకి 0.87 టీఎంసీ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీకి 0.71 టీఎంసీ నీరు ఉంది.