రాష్ట్రీయం

హజ్‌యాత్ర షెడ్యూల్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : 2019 హజ్‌యాత్ర ఫ్లైట్ షెడ్యూల్ ఖరారైంది. టెక్నాలజీని ఉపయోగించుకుని సమయాన్ని మిగుల్చుకోమని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా హజ్ యాత్రికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏ విమానంలో, ఏ తేదీన ప్రయాణం చేయనున్నారో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సమాచారం ఇస్తుందన్నారు.
ఆ సమాచారం వచ్చిన వెంటనే హజ్ యాత్రికులు తమ సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫ్లైట్ బుకింగ్ కన్‌ఫర్మేషన్ చేసుకోవాలని, అర్థం కాకపోతే సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి చేసుకోవచ్చని, లేదా జిల్లా హజ్ సొసైటీల సహాయం తీసుకోవాలని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాజుద్దీన్ ఆరిఫ్ యాత్రికులకు పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ ఫ్లైట్ బుకింగ్ కన్‌ఫర్మేషన్ చేసుకోవడం వల్ల ప్రయాణానికి 48గంటల ముందే నాంపల్లి హజ్ హౌస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని, కేవలం 10గంటల ముందు వెళితే సరిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొదటి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-5375 ఈ నెల 31న మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జిద్దా బయలుదేరనుంది. ఈ విమానంలో గుంటూరుకు చెందిన 207, కృష్ణా జిల్లాకు చెందిన 113, విశాఖపట్నం నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరి నుండి 20 మంది వెళ్లనున్నారు.
ఆగస్టు 1న మధ్యాహ్నం 12.45 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-5383 విమానం 343 మంది యాత్రితకులతో హైదరాబాద్ నుంచి జెద్దా బయలుదేరనుంది. 2న మధ్యాహ్నం 12.55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-5391 విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 268 మంది యాత్రికులు హైదరాబాద్ నుండి జెద్దా బయలుదేరనున్నారు. 3న మధ్యాహ్నం 12.55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-5403 విమానంలో 343 మంది జెద్దాకు వెళ్లనున్నారు. 3న మధ్యాహ్నం 12.55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానం ఏఐ-5397లో మొత్తం 341 మంది జెద్దాకు వెళ్లనున్నారని ఆయన వివరించారు.