రాష్ట్రీయం

చంద్రయాన్-2 ప్రత్యక్ష ప్రసారం విద్యార్థులకు చూపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 21: చంద్రయాన్-2 ప్రయోగాన్ని విద్యార్థులంతా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్, వర్చువల్ తరగతులు, టీవీ, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం మధ్యాహ్నం 2 నుండి 2.30 గంటల వరకు చంద్రయాన్-2 ప్రయోగ విశేషాలను, దాని ప్రాముఖ్యతను ఇస్రో వెబ్‌సైట్ లింక్ ద్వారా విద్యార్థులకు చూపించాలని మంత్రి పేర్కొన్నారు.