రాష్ట్రీయం

మహంకాళికి బోనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: లష్కర్ బోనాలను పురస్కరించుకుని ఆదివారం సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాన్ని సమర్పించి సీఎం తన మొక్కులు సమర్పించారు. మహంకాళీ ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంటికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో ముత్యాలగుడి వద్ద కారు దిగి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పద్మారావు ఇంట్లో భోజనం చేశారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. ఇలా ఉండగా ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు అత్యంత వైభోపేతంగా జరిగాయి. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరం నలుమూలల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి తన కుటుంబం సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పర్యాటకశాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు.

చిత్రం...ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు