రాష్ట్రీయం

మోసాలు.. అబద్ధాలు.. మాకు చేతకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: గతంలో పాదయాత్ర ప్రారంభం ఆపై ముగింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్‌లపై తాను చేసిన విభిన్న ప్రకటనలపై మంగళవారం శాసనసభలో వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే తొలుత టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్, డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, బెందాళం అశోక్, నిమ్మల రాయుడు అడిగిన ప్రశ్నపై దాదాపు రెండు గంటల పాటు సభలో రసాభాస నెలకొంది. దీనిపై సీఎం జగన్ మూడు సార్లు సభలో వీడియో క్లింపింగ్‌లను ప్రదర్శించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తూనే వచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో లేరు. సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మహిళల పెన్షన్‌లపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మోసం చేయడం... అబద్ధాలు ఆడటం తమ ఇంటావంటా లేవని ఈ సభలో మరోసారి చెబుతున్నానన్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టోను చూపించి ఓట్లు అడిగితే ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎన్నికలప్పుడు జగన్ అనే నేను... ఏమీ మాట్లాడానో టీవీ స్క్రీన్‌లలో చూపిస్తాను, చూసిన తర్వాతయినా మీకు మనస్సాక్షి ఉంటే క్షమాపణ చెప్పమని కోరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన ప్రసంగాలను వీడియోలను సభలో ప్రసారం చేసి వినిపించారు. పాదయాత్ర ప్రారంభంలో 2017, అక్టోబర్ 10వ తేదీన ధర్మవరంలో 45 ఏళ్లు దాటిన దళిత, బలహీన వర్గాల మహిళలకు నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ ప్రకటించినమాట వాస్తవమే... ఆపై రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు... అమలులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి తన పాదయాత్ర ముగింపులో ఉత్తరాంధ్ర మాడుగల నియోజకవర్గంలో 2018, సెప్టెంబర్ మూడో తేదీ ఈ పెన్షన్‌లపై తాను స్పష్టమైన ప్రకటన చేసానన్నారు. ఏటా 18,500లు చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలను నేరుగా ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించి, అదే హామీని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించానన్నారు. అయితే టీడీపీ సభ్యులు చివరగా ఇచ్చిన హామీ పక్కన బెట్టి తొలి ప్రకటనను పట్టుకుని ఇంతటి రభస సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. దళిత, మైనార్టీ, బలహీనవర్గాలకు చెందిన అక్కలు అనారోగ్యం కారణంగానో ఇతర కారణాలతోనో వారం రోజులు పనులకు వెళ్లకపోతే వారు ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ క్రమంలో ఆ వర్గాల అక్కలకు తోడుగా ఉండాలని 45 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలని తాను చెబితే ఆ వయస్సుకే పెన్షన్ ఏమిటని పలువురు వెటకారం చేస్తూ చేసిన సూచనలకు కూడా పరిగణలోకి తీసుకుని
‘వైఎస్సార్ చేయూత’ అనే కొత్త పథకానికి నాంది పలుకుతున్నామన్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల రూ.75వేలు ఉచితంగా ఇస్తామన్నారు. రెండో ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్‌ల ద్వారా పూర్తి పారదర్శకతతో ఏ మాత్రం అవినీతికి తావులేకుండా ప్రతి అక్కకు అందే విధంగా చూస్తామన్నారు. ఈ వీడియోలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఇందులో వక్రీకరణకు తావులేనప్పటికీ ఈ అంశాన్ని పట్టుకుని విలువైన సభా సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృథా చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ విషయంలోనూ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పెద్ద మనిషి ఈ సభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమన్నారు. ఇప్పటికైనా ఈ అంశానికి ఫుల్‌స్టాప్ పెట్టి కీలక బిల్లులపై చర్చ చేపట్టాలని సభాపతిని కోరారు.