ఆంధ్రప్రదేశ్‌

మాఫియా గుప్పెట్లో ఉచిత ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఇసుక సమృద్ధిగా లభించే ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా. గోదావరి నది ఇసుకకు నిర్మాణ రంగంలో మరింత డిమాండ్ ఉంది. ఇక్కడ ఇసుక గతంలో నౌకలపై విదేశాలకు సైతం ఎగుమతైంది. ఇదికాస్త పక్కన పెడితే... ఉచిత ఇసుక విధానం మాఫియా చేతిలోకి వెళ్లిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదొక సదవకాశంగా పరిణమించిందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటన ఇచ్చిందే తడవుగా ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిన మాఫియా ముందస్తు సమాచారంతోను పొక్లెయినర్లతో సిద్ధమై అవిశ్రాంతంగా ఎక్కడిపడితే అక్కడ తవ్వకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక మాటున పెద్దయెత్తున పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని సామాన్యుడికి అతి సానుకూలంగా ఇసుకను అందించడమే పరమావధిగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. పెద్దయెత్తున యంత్ర సామాగ్రి, సరంజామా స్వయంప్రతిపత్తి కలిగిన మాఫియా ప్రభుత్వ మిషనరీకి అనుమతి ఇవ్వకముందే తవ్వకాలు మొదలుపెట్టేసింది. ఎక్కడ ఇసుక తవ్వాలో మాఫియాకు తెలిసినంతగా ప్రభుత్వానికి తెలియకపోయింది. ఒకవేళ తెలిసినా పట్టించుకునే పరిస్థితి, పర్యవేక్షణకు అవసరమైన యంత్రాంగం లేదు. ఇదే సదవకాశంగా అక్రమార్కులు నదీ గర్భాన్ని తూట్లు పొడుస్తూ కోట్లు గడిస్తున్నారు. అడ్డగోలుగా నదీగర్భాన్ని చీల్చేస్తూ మరీ ఇసుకను తవ్వేస్తున్నారు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ టెండర్లు చేపడుతున్న నేపథ్యంలో ఈలోగానే సాధ్యమైనంత త్వరగా ఇసుకను కొల్లగొట్టాలని మాఫియా భావిస్తోంది. గోదావరి నదిలో ఇసుక దిబ్బలను తొలగించడం ద్వారా నదీ గర్భాన్ని పెంచడంతోబాటు నీటి లభ్యత పెరుగుతుందని, ఇటు ఇసుక ఆదాయంతోపాటు అటు నదీ గర్భాన్ని కూడా పెంచడానికి దోహదపడుతుందని ఈ ప్రక్రియను డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఈమేరకు నదిలో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమయ్యే పరిస్థితి ఉందని అంచనావేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పనులు మొదలు పెట్టకముందే ఉచిత ఇసుక సరఫరాకు యంత్ర సామాగ్రిని అనుమతించారు. వాస్తవానికి ఉచిత ఇసుక విధానంలో యంత్రాలకు తావులేదు. కేవలం పర్యావరణ స్నేహపూర్వక విధానంలో మానవ వనరుల ద్వారానే ఇసుకను వెలికితీయాల్సివుంది. అయితే డిమాండును సత్వరం అధిగమించాలనే ఉద్దేశంతో ఈ విధానంలో యంత్రాలను అనుమతించింది. దీంతో రాత్రికి రాత్రే ఇసుక కొల్లగొడుతున్నారు. ఇదికూడా మాఫియాకు వరంగా పరిణమించిందంటున్నారు. ఉచిత ఇసుక విధానం రాజధాని నిర్మాణాల అవసరాలను బట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా తీసే ఇసుక కూడా రాజధాని నిర్మాణాలకు దోహదపడే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా ఇసుకను నది నుండి తీయాల్సి ఉంది. కాని ఇందుకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అఖండ గోదావరి దిగువ ప్రాంతంలోని మందపల్లి, ఆలమూరు, జొన్నాడ, పి గన్నవరం వంటి ప్రాంతాల్లో, బ్యారేజీకి అతి సమీపంలో, అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలోని వంగలపూడి, సీతానగరం, వెంకటనగరం, ముగ్గళ్ల వంటి ప్రాంతాల్లోను పెద్దయెత్తున అక్రమ తవ్వకాలు సాగుతున్నాయ.

రామతీర్థంలో ఘనంగా
సీతారాముల కల్యాణం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 15: విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ సీతారామ కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. ఉదయం నుంచే రామతీర్థం రామాలయం సమీపంలోని మైదానంలో సీతారామ కల్యాణం వేదపండితుల పర్యవేక్షణలో ప్రారంభమైంది. సీతారాముల వారికి రాష్ట్రప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆలయ పూజారి కండవిల్లి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో 11.40 గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టే కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మవారి మెడలో రాములవారు మాంగళ్యధారణ జేశారు. ఆ వెంటనే తలంబ్రాల కార్యక్రమం వేలాదిమంది భక్తుల జయజయధ్వనాల మధ్య నిర్వహించారు.

పుణ్యస్నానాలకెళ్లి ఐదుగురు మునక
పండగ పూట విషాదం

భద్రాచలం/బాపట్ల/ రాజమండ్రి ఏప్రిల్ 15: శ్రీ రామనవమి పండుగనాడు పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లి రాష్ట్రంలో ఐదురురు మృత్యువాతపడ్డారు. భ ద్రాచలంలో ఇద్దరు. బాపట్ప వద్ద ఇద్దరు. రాజమండ్రి గోదావరిలోఒకరు నీటమునిగారు. విజయవాడ నుంచి రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చి భద్రాచలం గోదావరిలో స్నానమాచరిస్తూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సింగ్‌నగర్, వడ్డెరకాలనీలకు చెందిన గుంజా శివయ్య(18), వయ్యపు రాము(18) శుక్రవారం స్వామివారి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం చేరుకున్నారు. ఉదయం గోదావరిలో స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. లోతుకు వెళ్లి వీరిద్దరూ గల్లంతయ్యారు. సాయంత్రం వరకు వారి ఆచూకీ తెలియరాలేదు. అలాగే గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో స్నానాలాచరించడానికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడ్డారు. మండలంలోని అప్పికట్లకు చెందిన ఇనగంటి ఫణీంద్రబాబు(22), అదే గ్రామానికి చెందిన దాసరి సాయికృష్ణ(23) స్నేహితులు. వీరిరువురూ కలసి గురువారం సూర్యలంక సముద్రంలో స్నానమాచరించడానికి దిగి గురువారం రాత్రి వరకు జాడ లేకుండా పోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు అందించిన సమాచారం మేరకు గాలించగా శుక్రవారం సాయంత్రం మృతదేహాలు పొగురు వద్ద కొట్టుకువచ్చి కనిపించాయి. స్థానిక జాలర్ల సాయంతో వీరి మృతదేహాలను స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే లఘు చిత్రం కోసం స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక యువకుడు గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఈసంఘటన శుక్రవారం రాజమహేంద్రవరం పుష్కరాలరేవులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పువ్వాడ మోహనకృష్ణ(26) లఘు చిత్రం తీసేందుకు నలుగురు స్నేహితులతో కలిసి నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం వచ్చాడు. శ్రీరామనవమి సందర్భంగా స్నానం, పూజలు చేసేందుకు పుష్కరాలరేవుకు వెళ్లాడు. గోదావరిలో దిగిన అతనికి ఈత రాకపోవడంతో మునిగిపోయి మరణించాడు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

పిట్టల్లారాలుతున్న జనం

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం/కడప/కర్నూలు, ఏప్రిల్ 15: భానుడి ధాటికి రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 11మంది వడదెబ్బకు మృతి చెందారు, మరోపక్క ఎండల తీవ్రత తగ్గలేదు. శుక్రవారం కడపలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. తాళ్లపొద్దుటూరులోఅత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అనంతపురంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెలలో అత్యధికంగా 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు నగరంలో 43.6, ఆదోనిలో 43, నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ల ఎమ్మిగనూరులో సోమన్న (63), చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామంలో చిన్నరాముడు (67), బేతంచర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వెంకటయ్య (62), అనంతపురం జిల్లా ధర్మవరంలో రాధాకృష్ణ (45), కడప జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామానికి చెందిన రామచంద్ర (46), ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన అంజనయ్య (40) వడదెబ్బకు మృతిచెందారు. ఖమ్మం జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గార్లలోని పుట్టకోట బజారులో నివాసముంటున్న రేణికుంట్ల రాఘవులు(70) బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన సింగం భద్రమ్మ(70) మృతి చెందింది. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు చెందిన నూకాలమ్మ (70) వడదెబ్బతో మృతి చెందింది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం పిట్టలమెట్టకు చెందిన జి.శివున్నాయుడు(75) వడదెబ్బతో మృతి చెందాడు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో మల్లవరపు వెంకటేశ్వర్లు (80) స్వల్ప అస్వస్థతకు గురికాగా వీస్తున్న వడగాలులకు తాళలేక మృతిచెందాడు.

త్వరలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఏప్రిల్ 15: త్వరలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం, ఓజిలి వద్ద స్పోర్ట్స్ స్టేడియం ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం ఆది గురువని తదనంతరం కొంతమంది దేశం మీద పడి మన విద్యా వ్యవస్థను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేశారని అన్నారు. మన దేశంలో కూడా గొప్ప నాయకులున్నారని, దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మహనీయుల స్ఫూర్తివంతమైన జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. భారతదేశంలో గొప్పవారంతా సాధారణ జీవితం నుంచి అసాధారణ వ్యక్తులుగా ఎదిగారన్నారు. ఈ కోవలో పత్రికలు వేసిన అబ్దుల్‌కలాం దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగాడనీ, టీ అమ్మిన వ్యక్తి దేశ ప్రధానిగా ఎన్నుకయ్యారని గుర్తుచేశారు. దేశంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందుకొని యువత, విద్యార్థులు తమ భవితకు బాటలు వేసుకోవాలని హితవుపలికారు. బారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భారతమాతాకి జై, వందేమాతరం అనే నినాదాన్ని పలకాలని ఆయన అన్నారు. భారతమాతాకి జై అంటే మన అమ్మకు నమస్కరించినట్లని అందులో పెడఅర్ధాలు లేవని, కొంత మంది రాజకీయ నాయకులు, అవకాశవాదులు తమ రాజకీయ లబ్ధికోసం రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మరో రెండు యూనివర్శిటీలు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు మరింతగా కృషి చేస్తానని వెంకయ్య హామీనిచ్చారు. జూనియర్ వైద్యులు తప్పనిసరిగా గ్రామాల్లో పనిచేయాలని కోరారు. క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, నెల్లూరు తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.