రాష్ట్రీయం

చిన్నమ్మా. . నిను మరువదీ గడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రతిపక్ష నేత హోదాలో కీలక భూమిక పోషించిన దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతి పట్ల పార్టీలకు అతీతంగా తెలంగాణ నేతలు, ప్రజా సంఘాలు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లోపల, బయట నిర్వహించిన పాత్రను నెమరు వేసుకుంటూ బాధతప్త హృదయాలతో నివాళులు ఆర్పించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తన సంతాప సందేశంలో ‘సుష్మా స్వరాజ్ మృతి వార్త తనకు తీవ్ర విషాదానికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె గొప్ప వక్త. భారతీయ రాజకీయ చరిత్రలో అత్యంత ఆదరణ ఉన్న జాతీయ మహిళ నేత. ఆమె ఏ పదవిలో ఉన్నా, తనదంటూ ఒక ముద్ర వేశారు. దేశంలో కొన్ని లక్షల మంది ఆమెను అభిమానించే వాళ్లు ఉన్నారు. ఈ దేశం అద్భుతమైన పార్లమెంటేరియన్‌ను కోల్పోయింది’ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్‌లో తెలియజేసిన సంతాప సందేశంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఇచ్చిన మద్దతును రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. చిన్నమ్మా మీ ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కృషిని కొనియాడుతూ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్‌తో పాటు సుష్మాస్వరాజ్ పాత్ర ఎంతో ఉందని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నమ్మగా తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆమె ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సుష్మాస్వరాజ్ నిర్వహించిన పాత్రను యావత్తు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంలో అది ఆమోదం పొందడానికి సుష్మాస్వరాజ్ చేసిన కృషి, తీసుకున్న చొరవను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ట్విట్టర్‌లో ‘సుష్మాస్వరాజ్ ఇక లేరన్న వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆమె అద్భుతమైన వ్యాక్చార్యానికి తాను గొప్ప అభిమానినని పేర్కొన్నారు.
బీజేపీ కార్యాలయంలో నివాళి
తెలంగాణ ఉద్యమంతో సుష్మా స్వరాజ్‌కు విడదీయరాని బంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, ఇందస్రేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణతో కలిసి సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్‌లోనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో సుష్మాస్వరాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ చిన్నమ్మగా ఈ ప్రాంత ప్రజల హృదయాలలో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.