రాష్ట్రీయం

భాషకు మతం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: మన దేశంలో నేడు ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితులపై బలమైన ఆలోచనతో కూడి చర్చ జరుగుతోందని, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు, భిన్నాభిప్రాయాలుంటే వినే, చర్చించే ఓపిక, విభేధించే పరిస్థితుల్లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావు అన్నారు. శనివారం నగరంలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మత రాజకీయాలను విమర్శించారు. ప్రభుత్వ ఒక మతాన్ని వ్యతిరేకించటం లేక అతిగా ప్రాధాన్యత ఇవ్వటం
సరికాదని, దేశంలో మతం, జాతీయ వాదం పేన వేసుకుపోయాయని అన్నారు. నాతో ఉంటే దేశభక్తుడివి లేకపోతే దేశ ద్రోహివి అన్న పరిస్థితులు నేడు దేశంలో నెలకొన్నాయని అన్నారు. నాధురామ్ గాడ్సే దేశభక్తుడు అంటూ సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తాను కూడా సామాజిక మాధ్యమాల్లో ఖండించినట్లు తెలిపారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ తనకు ట్విటర్‌లో కామెంట్లు రావటం ఎంతో బాధ కల్గిచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం స్థిరమైన రాష్ట్రంగా ముందుకెళ్లేందుకు అవసరమైతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో లోపాలుంటే ఎత్తి చూపేందుకు, అలాగే మంచి నిర్ణయాలను అభినందించేందుకు ఆరేళ్ల క్రితం తెలంగాణ వికాస సమితి సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఏర్పడిందని వివరించారు. మతానికి భాష ఉందని, భాషకు మతం లేదన్న ప్రొ.జయశంకర్ మాటలను గుర్తుచేస్తూ మన పూర్వీకులు కూడా చక్కటి ఉర్దూలో మాట్లాడే వారున్నారంటూ దివంగత నేతలు పీవీ నర్సింహారావు, మర్రిచెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డిలతో పాటు నేటి మన సీఎం కేసీఆర్ కూడా తెలుగుతో పాటు అనర్గళంగా ఉర్దూలో మాట్లాడుతారని అన్నారు. అనాదిగా కుల,మతాలకతీతంగా, ఎలాంటి భేధాభిప్రాయాల్లేకుండా అద్భుతమైన సంస్కృతి కల్గి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. భద్రాద్రి రాముడి కల్యాణానికి అధికారికంగా సీఎం గానీ దేవాదాయా శాఖ మంత్రి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించటం నేటి ఆనవాయితీ కాదని, నిజాం నవాబులు సైతం సాంప్రదాయబద్దంగా సమర్పించేవారని గుర్తు చేశారు. సాటి మనిషిగా ఇతరుల నుంచి గౌరవాన్ని కోరుకుంటూ, ఆత్మగౌరవంతో జీవించే గొప్ప జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని పేర్కొన్నారు. ఈ సభలో ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పాల్గొన్నారు.