రాష్ట్రీయం

నేడు నాగార్జున సాగర్ నాలుగు గేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 11: కృష్ణానది ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదల ఉద్ధృతి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతుండటంతో సోమవారం ఉదయం 8గంటలకు నాలుగు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు. సాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు నదిలోకి వెళ్లరాదని, చేపల వేట, పశువుల మేపుటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా బేసీన్‌లో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి వస్తున్న భారీ వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ దూకుడుతో సాగర్ ప్రాజెక్టు కూడా నిండే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఆదివారం రాత్రికల్లా 7లక్షల 79వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. సాగర్ జలాశయానికి 24 గంటల వ్యవధిలో దాదాపు 60 టీఎంసీల వరద నీరు అదనంగా చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి 8 లక్షల 46 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటం, వరద ఉద్ధృతి మరింత పెరుగుతుండటంతో సాగర్‌కు మరింత నీటిని వదలుతున్నారు. దీంతో ఎగువన ప్రాజెక్టుల నుండి నిరంతరాయంగా వస్తున్న వరదల నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జూరాల 66 గేట్లు ఎత్తివేయగా, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 33 అడుగుల మేరకు ఎత్తి దిగువకు సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల సాగిస్తున్నారు. శ్రీశైలం నుండి వస్తున్న ఇన్‌ఫ్లోతో సాగర్ జలాశయం వేగంగా నిండుతుండగా ఆదివారం ఎడమకాలువ, లోలెవల్, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలకు మంత్రులు తెలంగాణ, ఏపీ మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు, 312 టీఎంసీలు కాగా, ఆదివారం రాత్రికి 199 టీఎంసీలకు చేరుకుంది. ఆదివారం కుడి కాలువకు 2419 క్యూసెక్కులు, ఎడమకాలువకు 1224 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల, లోలెవల్ కెనాల్‌లకు 2వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.