రాష్ట్రీయం

బీజేపీలోకి మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కుప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని అన్నారు. టీఆర్‌ఎస్ నిరంకుశ విధానాలతో జనం విసిగి పోయి ఉన్నారన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఢీ కొనే స్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. ఆదివారం మోత్కుపల్లి నివాసానికి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ వెళ్లారు. బీజేపీలో చేరాలని ఈ ఇద్దరు నేతలు ఆయనను ఆహ్వానించారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మోత్కుపల్లి త్వరలోనే తాను బీజేపీలో చేరుతానని హామీ ఇచ్చారు. గత వారంలో బీజేపీలో మాజీ ఎంపీ జీ. వివేక్ చేరిన విషయం విదితమే. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో వివేక్ చేరారు. మోత్కుపల్లి కూడా బీజేపీ అగ్రనేతల సమక్షంలో త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.