రాష్ట్రీయం

గ్రీన్ చాలెంజ్‌లోకి రాహుల్‌గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌కు ఆదరణ అనూహ్యంగా పెరుగుతోంది. కొత్తగా గ్రీన్ చాలెంజ్‌లోకి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ తాను సైతం అంటూ గ్రీన్ చాలెంజ్‌కి మద్దతు ప్రకటించారు. పచ్చదనం పెంపే లక్ష్యంగా గ్రీన్ చాలెంజ్ ముందడుగు వేస్తోంది. ఆదివారం నాటికి గ్రీన్ చాలెంజ్ ఆధ్వర్యంలో రెండుకోట్ల మొక్కలు నాటి శభాష్ అనిపించుకుంది. దేశవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలతో పాటు రాజకీయ రంగానికి చెందిన అనేకమంది గ్రీన్ చాలెంజ్‌కి బాసటగా నిలిచారు. గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.