రాష్ట్రీయం

అసంఘటిత కార్మికులకు కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 21: అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం జాతికి అంకితం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించనున్న ఓపీడీ బ్లాక్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగ్వార్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని అన్నారు. సనత్‌నగర్‌లో ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర రాజధానులే కాకుండా ప్రతి జిల్లాలో ఆసుపత్రులను ఏర్పాటుచేసి స్థానికంగానే చికిత్సలు అందించాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పిల్లలకు ఇక్కడి మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించడం సంతోషకరమని అన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 36365 మందికి శస్తచ్రికిత్సలు నిర్వహించామని, 63వేల మందికిపైగా ఇన్ పేషెంట్లుగా, 12లక్షల మంది ఓపీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. ఆరోగ్య రంగంలో మోదీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. జీవన విధానంలో చోటుచేసుకున్న మార్పులతో 50 ఏళ్లలోపువారే అనారోగ్యాల బారిన పడుతున్న నేపథ్యంలో ఆయుస్మాన్ భారత్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. మహిళలు, గర్భిణుల కోసం మిషన్ ఇంద్రధనస్సు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ ప్రభుత్వం చేరాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ భారతదేశంలోనే నెంబర్-1 ఆసుపత్రిగా సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని కోరారు. రామగుండం, బోరబండ, ముషీరాబాద్ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే ఆసుపత్రులను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరిచి 1800 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి కోరారు. మేడ్చల్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేలాదిగా చిన్న పరిశ్రమలు ఉన్నాయని ఆయా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తుంటారని, వారికి వారి కుటుంబ సభ్యులకు చికిత్సలు అందించేందుకు ఆయా ప్రాంతాల్లో సొంత భవనాల్లో డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి హీరాలాల్ సమారియా పాల్గొన్నారు.
చిత్రం...ఈఎస్‌ఐసీ నూతన ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర కార్మిక మంత్రి గంగ్వార్ వెల్లడి