రాష్ట్రీయం

మహా జాతరపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, ఆగస్టు 23: సమ్మక్క-సారలమ్మ మహా జాతరపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. శుక్రవారం ఆయన సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా పూజారులు సంప్రదాయం ప్రకారం డోలు, సన్నాయి వాయిద్యాలతో పాటు స్వాగతం పలికి సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని, రోజురోజుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని, ఇంత పెద్ద జాతరకు ప్రభుత్వం శాశ్వత ఏర్పాట్లు కల్పించి భక్తుల సౌకర్యార్ధం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన మాత్రమే కొనసాగిస్తుందని, జాతరపై ఎలాంటి పట్టింపు చేపట్టడం లేదన్నారు. జాతరకు 200 కోట్ల రూపాయలు కేటాయించి యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అనంతరం ఆదివాసీ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా ఎంపీని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిసె బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరెం లక్ష్మీపటేల్, కొర్నిబెల్లి గణేష్, శేషగిరిరావు, మేడారం పూజారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.