రాష్ట్రీయం

పునరుత్పాదక విద్యుత్ సంస్థలకు రూ.2591 కోట్ల బకాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: వివిధ పునరుత్పాదక విద్యుత్ సంస్థలకు రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 2591 కోట్ల రూపాయల మేర బకాయి పడ్డాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద చెల్లింపులు సకాలంలో చెల్లించాల్సి ఉన్నప్పటికీ, భారీ మొత్తంలో బకాయి పడటంపై కేంద్ర ఇంధన శాఖ దృష్టి సారించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని కేంద్ర ఇంధన శాఖ ఇటీవల ఆదేశించడంతో పునరుత్పాదక ఇంధన సంస్థలకు కొంత మేర ఊరట లభించినట్లయింది. దేశంలో వివిధ సౌర, పవన విద్యుత్ సంస్థల నుంచి వివిధ రాష్ట్రాలు చేసుకున్న పీపీఏల మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. కానీ కొనుగోలు చేసిన విద్యుత్‌కు ఆయా రాష్ట్రాల ట్రాన్స్‌కోలు చెల్లింపులు చేయకపోవడంతో ఆయా విద్యుత్ సంస్థలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవల జారీ చేసిన నివేదిక ప్రకారం ఆగస్టు 16 నాటికి
దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సంస్థలకు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలు 6872 కోట్ల రూపాయలు మేర బకాయి పడ్డాయి. 2022 నాటికి దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం 175 గిగావాట్లుగా కేంద్ర ఇంధన శాఖ నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో కొనుగోలు చేసిన విద్యుత్‌కు చెల్లింపులు కూడా కీలకంగా మారాయి. పవన విద్యుత్ రంగంలో ఏపీ వాటా 17 శాతం కాగా, సౌర విద్యుత్ రంగంలో ఏపీ వాట 12 శాతం కావడంతో బకాయిలు ఆయా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2591 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉంది. దేశంలోని మొత్తం బకాయిల్లో ఏపీ వాటా దాదాపు 40 శాతం. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి సంబంధించి పీపీఏలను పునఃసమీక్షించేందుకు నిర్ణయిండంతో ఈ బకాయిలు ఎప్పడు చెల్లిస్తుందో తెలియని స్థితి నెలకొంది. ఇంధనం సరఫరా చేసినప్పటికీ క్రమంతప్పకుండా బిల్లులు చెల్లించపోవడంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దీనిపై దృష్టి సారించి డేటా బేస్ రూపొందిస్తోంది. పీపీఏ కింద విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ, బిల్లులు చెల్లించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని లెటర్ ఆఫ్ క్రెడిట్ (బ్యాంక్ గ్యారంటీ) ఇస్తేనే ఆగస్టు 1 నుంచి విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర ఇంధన శాఖ స్పష్టం చేయడంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెలకు ఒకసారి కాకుండా 10 రోజులకు ఒకసారి ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే తూర్పు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన అమలును వాయిదా వేయాలని కోరింది. అయినా కేంద్రం అంగీకరించకపోవడంతో కొంత మేరకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది.