రాష్ట్రీయం

రాజుకుంటున్న జియో ట్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: జియో ట్యాగిం గ్ వివాదం మరింత రాజుకుంటోంది. జియో ట్యాగింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ యాప్ ఇన్‌స్టాలేషన్ను నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వైద్య సిబ్బంది నిరాకరించగా నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైద్యులు నిరాకరించారు. దీంతో ఆయుష్ డైరక్టర్ అలుగు వర్షిణి తాజాగా యాప్ ఇన్‌స్టాలేషన్‌ను నిరాకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. పైలెట్ ప్రాజెక్టుగా ఆయుష్ వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాలు వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ను కలిస్తే ఈ విధానాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మొత్తానికి ప్రవేశ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో కంగుతిన్న వైద్య, ఆరోగ్య శాఖ
ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నింటితో చర్చించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టే దిశగా యోచిస్తున్నారు. తనకే తెలియకుండానే జియో ట్యాగింగ్ విధానానికి ఎలా శ్రీకారం చుడుతారని తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులతో వ్యాఖ్యానించిన వైద్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శాఖ మొత్తానికి ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నట్టు మంత్రి సంకేతాలు ఇవ్వడం పట్ల ఉద్యోగులను మరింత ఆందోళనకు గురి చేసింది. మంత్రికి కూడా తెలియకుండా ఇంతటి కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయుష్ వైద్యుల సంఘం డైరెక్టర్‌ను ప్రశ్నించగా, అన్ని విషయాలు మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించినట్టు సమాచారం. పైగా అడ్మినిష్ట్రేషన్‌కు సంబంధించిన విషయాలను మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆమె స్పష్టం చేసినటు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చార్మినార్ వద్దనున్న ఆయుర్వేదిక్ ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించాలని ఆయుష్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయుష్ విద్యార్థులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే తాజాగా జియో ట్యాగింగ్ నిర్ణయంతో మరోసారి ఆయుష్ డైరెక్టర్ వివాదానికి తెరలేపడంతో ఆమెను వైద్యశాఖ ఉన్నతాధికారులు వివరణ కోరినట్టు తెలిసింది.