రాష్ట్రీయం

తెలంగాణకు అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 23: తెలంగాణ ప్రభుత్వానికి అవార్డుల పంట పండింది. ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ అధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ స్థాయిలో ‘పోషణ అభియాన్ అవార్డు’లు రెండు దక్కాయి. క్షేత్రస్థాయిలో మరోరెండు అవార్డులు తెలంగాణ దక్కించుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, రక్తహీనతను తగ్గించి శిశుమరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమం అమలుచేస్తోంది. ఈ కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందించింది. పోషణ అభియన్ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మోడల్, షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయిలో లీడర్‌షిప్, కన్వర్జెన్స్ అవార్డు విభాగంలో సంగారెడ్డి జిల్లా ఎంపికైంది. బ్లాక్ లెవల్
విభాగంలో ఇబ్రహీంపట్నం మండలం నిలిచింది. జిల్లా విభాగంలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, మోజిరాం రాథోడ్, ఎన్ మోతి, శ్రీనివాసరావు, గాయత్రి అవార్డులను అందుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో ఢాబా కే అంకిరెడ్డిపల్లెకు చెందిన అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఏడబ్ల్యూహెచ్‌లు మరుభాయి, అంజనాభాయి, మెర్రాం శ్రీదేవి, జంగుభాయి, భాగ్యలక్ష్మీ, కొలుకూరి భాగ్య, కొలుకూరి సాయిలత, తుంగ ఇంద్ర, అనిత, ఉన్నం అంజన్మమ్మ అవార్డులను అందుకున్నారు.