రాష్ట్రీయం

ఏ విచారణకైనా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ విద్యుత్ సంస్థలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం విద్యుత్ సౌధాలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావుతో కలసి ప్రభాకర్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో కుంభకోణం జరిగిందని మీడియాలో కథనాలు రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. విద్యుత్ సంస్థలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ, సుప్రీం కోర్టు, లేదా సిట్టింగ్ జడ్జితో విచారం చేయించుకున్నా తాము సిద్ధమేనని ఆయన ప్రకటించారు. విద్యుత్ సంస్థలపై అవాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు రాసేముందు మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకుంటే బావుంటుందని దేవులపల్లి చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరగలేదని చెప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూపాల్‌పల్లిలో 600 మెగావాట్లు, పులిచింతలలో 120, కేటీపీఎస్ పాల్వంచలో 800, జైపూర్ సింగరేణిలో 1200 మెగావాట్లు కొత్తగా వచ్చినవేనన్నారు. 2014లో
సోలార్ 71 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 3600 మెగావాట్లకు చేరుకుందన్నారు. 2014 తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి 7,778 మెగావాట్లు ఉంటే గత నాలుగేళ్లలో 16,203 మెగావాట్లు పెంచామన్నారు. విద్యుత్ టారిఫ్‌లపై వస్తున్న వార్తల్లో నిజాలులేవని ఆయన కొట్టిపారేశారు. రాత్రికిరాత్రి ఒప్పందాలు జరిగాయని చెప్పడం సత్యదూరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలు దివాలా తీస్తున్నాయని చెప్పడం సమంజసం కాదని సీఎండీ పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు జరిగాయని విమర్శించడం అతిశయోక్తి అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను కొంతమంది రాజకీయ నేతలు ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేస్తూ విద్యుత్ సంస్థల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువకు ధరకు విద్యుత్ అందుబాటులో ఉంటే ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఎందుకని పలువురు రాజకీయ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్ళు అంతా పారదర్శకంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే తమ వద్దకు వస్తే వాటికి సంబంధించిన వాస్తవాలను బయటపెడతామన్నారు. విద్యుత్ సంస్థలపై ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని తాము ఈ విషయాలు చెబుతున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు మీడియా తప్పుదోవపట్టించ కూడదని ఆయన చెప్పారు. సంస్థలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటని తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దుతామని ఆయన ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో తెలంగాణకు దేశంలో రెండోస్థానం దక్కిందన్న విషయాన్ని మరచిపోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత విద్యుత్ రంగం సాధించిన విజయాలను విమర్శకులు బేరేజీ వేసుకోవాలన్నారు. ప్రతి పని టెండర్ల ద్వారా కేటాయించడం జరుగుతుందని దేవులపల్లి స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని సీఎండీ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు రూ. 22, 000 కోట్లరూపాయలను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేశామన్నారు. 14, 000 వేల ట్రాన్సిఫారమ్‌ల స్థానంలో 31, 000 ఎంవీఏకు పెంచామన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల పని తీరుపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు.