రాష్ట్రీయం

ఆంధ్రాలో బీజేపీ బలోపేతానికి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేసే విషయమై బీజేపీ ఏపీ శాఖకు చెందిన నేతల సమావేశం శనివారం ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, మాజీ మంత్రి పురంధ్రీశ్వరి, సునీల్ థియోథర్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రరాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమరావతి రాజధానిపై జరుగుతున్న రగడ, పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు, రివర్సింగ్ టెండర్ విధానం తదితర అంశాలపై నేతలు చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ బలహీనపడినందున, పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఈ సమావేశంలో పలువురు నేతలు సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరితో ప్రజలు విసుగెత్తి ఉన్నారని, వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైందని, పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అనువైన సమయం ఇదేనని పలువురు నేతలు పార్టీ హైకమాండ్‌కు తెలిపారు. బీజేపీ రాష్టశ్రాఖలో నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. రాయలసీమలో హైకోర్టు ఉండాలని, అమరావతిలోనే పరిపాలన రాజధాని ఉండాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు,. అమరావతిలోనే రాజధాని ఉండాలని, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఏపీ బీజేపీ నేత రాంబొట్ల సురేష్ ఆధ్వర్యంలో కొంత మంది నేతలు బీజేపీ తెలంగాణ శాఖ కార్యాలయంలో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.