రాష్ట్రీయం

వివాదంలో పవన్ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 1: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఆయన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో వివాదంలో చిక్కుకున్నాయి. ఆయన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జిలు, మరి కొన్ని ప్రాంతాల్లో ఆయన వేడుకలను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఆయన స్వయంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో మరోమారు ఫ్లెక్సీ వివాదాలు ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో పెద్ద ఎత్తున పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. దీంతో బడి, గుడి, టీ సెంటర్లలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా చెయ్యాలని నిర్ణయించారు. అయితే ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 2వ తేదీన వినాయక చవితి పర్వదినం కావడంతో కళాశాలలకు సెలవులు ప్రకటించారు. దీనితో ముందస్తుగా జనసేనాని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలల్లోని పవర్ స్టార్ అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో పెద్దఎత్తున వేడుకలకు భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విద్యార్ధులు సమాయాత్తమయారు. ఈ నేపధ్యంలోనే నరసాపురంలో పోలీసులు యవత, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్ ఆందోళనకు దిగారు. అక్కడ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక తాడేపల్లిగూడెంలోని ఒక కళాశాల వద్ద విద్యార్థులు భారీ కేకును ఏర్పాటుచేశారు. ఆ వేడుక కూడా వివాదాస్పదంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసుకున్న కేకు, ఫ్లెక్సీలను ఇతరులు వచ్చి ధ్వంసంచేశారు. ఇక భీమవరంలోని భారీ ఎత్తున కిలోమీటర్ల మేర పవన్ కళ్యాణ్ కోసం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ బివి.రాజు విద్యాసంస్ధలకు వెళ్ళే రహదారిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అదే విధంగా ఎస్‌ఆర్‌కెఆర్ రెబల్స్ పేరుతో ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం విడుదల సందర్భంగా కిలోమీటర్లు కొద్దీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో కొన్నింటిని ఎవరో చింపేశారు. దీంతో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు దుండగుల కోసం వేటను ప్రారంభించారు. గతంలో కూడా ఇదే తరహాలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై కేసులు నమోదు చేశారు. ఇంకా ఆ కేసులో ఉన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి వివాదం ఏర్పడింది.