రాష్ట్రీయం

నెలాఖర్లో ‘మహా’ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18:గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఈనెలాఖరులో మహారాష్టత్రో ఒప్పందం కుదురనుంది. దీనికి సంబంధించి చర్చలు ముగిసి ఒక అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయినట్టు అయింది. ఈనెల 27న ప్లీనరీ తరువాత తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో హైదరాబాద్‌లో ఒప్పందాలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీ డిజైన్ చేసి తమ్మిడి హెట్టి, మేడిగడ్డ( కాళేశ్వరం) ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం పలు ధపాలు చర్చించింది. రెండు రాష్ట్రాలు మధ్య సూత్రప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చాయి. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మహారాష్ట్ర వ్యక్తం చేసిన అనుమానాలను తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు తీర్చారు. దీని కోసం హైదరాబాద్‌లో మహారాష్ట్ర తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది.
రీ ఇంజనీరింగ్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద లిఫ్ట్ ఉంటుంది. అక్కడి నుంచి వరుస బ్యారేజీల ద్వారా నీరు ఎల్లంపల్లి చేరుకుంటుంది. ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర అంగీకారం తెలపలేదు. దీంతో 148 మీటర్లకు అంగీకరించారు. 148 మీటర్ల ఎత్తుకు తమకు అభ్యంతరం లేదని తొలిసారిగా మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి విజయ్ శివ్ తారే 2015 మే 14న అధికారికంగా ప్రకటించారు. తమ్మిడి హెట్టి వద్ద 273 టిఎంసిల నీటి లభ్యత లేదని, 165 టిఎంసిల నీటి లభ్యత మాత్రమే ఉందని కేంద్ర జల సంఘం లెక్క కట్టింది. ఇక్కడి నుంచి 120 టిఎంసిల నీటిని తరలించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ మధ్య సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇక మేడిగడ్డ వద్ద 100 మీటర్లకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. తమ్మిడి హట్టి బ్యారేజీ సామర్ధ్యం 1.85 టిఎంసిలు కాగా, మేడిగడ్డ వద్ద 16 టిఎంసిల స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి.