రాష్ట్రీయం

జనసంద్రం రొట్టెల పండుగ ప్రాంగణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 11: గత రెండు రోజుల నుండి జరుగుతున్న నెల్లూరు బారాషాహిద్ దర్గా గంధ మహోత్సవం, రొట్టెల పండుగకు రెండోరోజైన బుధవారం భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో తమ కోర్కెలు తీరే రొట్టెలు పట్టుకునే వారితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. గత ఏడాది తాము పొందిన కోర్కెల రొట్టెలను ఈ ఏడాది మరొకరికి అందచేసి తాము మరో కోరికతో రొట్టెలను పట్టుకునే వారితో ఇక్కడ సందడి నెలకొంది. ఉద్యోగ, విద్య, గృహ రొట్టెలకు ఎక్కువగా డిమాండ్ కనిపించింది. ఏ ఏ రొట్టెలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో, ఎక్కడ మార్చుకోవచ్చునో అధికారులు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ తెలియచేస్తుండడంతో భక్తులకు తమ అవసరమైన రొట్టెలు వెతుక్కునే పని తప్పింది.
రొట్టెలు పట్టుకున్న మంత్రులు
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, జలనవరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్ బుధవారం దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ స్వర్ణాల చెరువులో రొట్టెలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పాల్గొన్నారు. పండగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ పండగలో భాగంగా అత్యంత ముఖ్యమైన గంధ మహోత్సవం బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించి గంధ లేపనం తర్వాత పంచే గంధం కోసం భక్తులు ఎదురుచూశారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రొట్టెల పండగ జరగనుంది. ఐదు రోజులపాటు పండగ నిర్వహించినప్పటికీ దర్గాలో పవిత్ర సమాధులకు గంధ మహోత్సవం పూర్తయిన తర్వాత రొట్టెలు మార్చుకునేందుకు, తమకు అవసరమైన కోర్కెల రొట్టెలను పట్టుకునేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తితో ఉంటారు.

చిత్రాలు.. పండుగకు తరలివచ్చిన జనసందోహం
*నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెలు అందుకుంటున్న మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్