రాష్ట్రీయం

అవే ఆఖరి మాటలనుకోలేదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : విహార యాత్ర విషాద యాత్రగా మారింది. ఆదివారం ఉగ్ర గోదావరిలో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సమీపంలోని కడిపికొండ పట్టణం మహారాజుల కాలనీకి చెందిన 14 మందిలో తొమ్మిది మంది గల్లంతు కాగా ఐదుగురు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బతికి బయట పడ్డారు. దీంతో కడిపికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాపికొండల విహార యాత్ర కోసం కడిపికొండకు చెందిన ఒకే సామాజిక వర్గం, పైగా బంధువులు కూడా అయిన 14 మంది యువకులు, మధ్య వయస్కులు రెండు రోజుల కిందట అంటే శుక్రవారం కాజీపేట నుండి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి వెళ్లి, అక్కడి నుండి పడవలో పాపికొండలకు వెళ్ళేందుకు లాంచీ ఎక్కారు. ఆ లాంచీ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు సమీపానికి రాగానే మునగడంతో అందులో ఉన్న కడిపికొండకు చెందిన 14 మందిలో తొమ్మిది మంది గల్లంతు అయ్యినట్టు సమాచారం. ఐదుగురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి వరకు కూడా గల్లంతైన వారి అచూకీ దొరకకపోవడంతో ఇక చనిపోయే ఉంటారని బంధువుల రోదనలు మిన్నంటాయి. పడవ ఎక్కే ముందు వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు చెప్పారు. ఇక తాము లాంచీ ఎక్కగానే సెల్‌ఫోన్ సిగ్నల్ ఉండవని చెప్పిన వారి మాటలే ఆఖరి మాటలంటూ బంధువులు రోదిస్తుంటే వారిని అపడం ఎవరితరం కాలేదు.
విహార యాత్ర కోసం గత నెల 9న రైలు రిజర్వేషన్ చేయించుకున్నారు. మొత్తం 14 మంది విహార యాత్రకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. గల్లంతైన తొమ్మిది మందిలో సీవీ వెంకటస్వామి (62), బస్కే రాజేంద్రప్రసాద్ (50) కొండూరు రాజ్‌కుమార్ (40) బస్కే ధర్మరాజు (42), గడ్డమీద సునీల్ (40) కొమ్ముల రవి (43) బస్కే రాజేంద్ర (58), బస్కే అవినాష్ (17), గొర్రె రాజేంద్రప్రసాద్ (50) ఉండగా సురక్షితంగా బయటపడిన వారిలో బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్, ఆరేపల్లి యాదగిరి ఉన్నారు. కాగా ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
*చిత్రాలు.. బోల్తా పడిన పడవ ప్రమాదంలో మృతులు
(ఫైల్‌ఫొటోలు)
* కడిపికొండలోని మహారాజుల కాలనీలో మృతుల కుటుంబాల రోదనలు