రాష్ట్రీయం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 20: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం తిరుపతిలో శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో సంవత్సరం పొడవునా నిర్వహించే అనేక ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవన్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజు అయిన 30వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వస్తున్న భక్తులకు అవరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలను భక్తులు తిలకించేందుకు తరలివచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రత్యేక అధికారి ఎ.వి.్ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, సీవీఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.