రాష్ట్రీయం

అన్నదాతా..సుఖీభవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: కడుపుకాలే పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘అమ్మ భోజనం’ జయ ‘టీ’టిఫిన్ పథకాలు విజయవంతమవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఒక పూటైనా భోజనం పెట్టాలని సంకల్పించింది. శ్రామికులు, బడుగు జీవుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. హరేకృష్ణ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్ నగరం పాలక సంస్థ 2మార్చి, 2015లో నాంపల్లిలోని సరాయ్‌లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత 50కేంద్రాలతో ప్రారంభమైన రూ. 5లకు భోజనం ఒక కేంద్రంలో 300మంది పేదలకు మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించింది. పేదల ఆకలిని తీర్చే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ఏప్రిల్ 4వ, తేదీన 100 సెంటర్లకు విస్తరించి రోజుకు రాష్ట్ర రాజధాని నగరంలో 15,000మంది పేదల ఆకలి తీరుస్తోంది.
ఈ పథకానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ఏటా 11కోట్ల నిధులు వెచ్చించేందుకు ప్రణాళికను రూపొందించింది. రాజధానిలోని వంద కేంద్రాలలో మధ్యాహ్నం 12గంటల నుంచి ఒంటి గంట వరకు పేదలకు ఐదు రూపాయల భోజనం అందించడం పట్ల పలు స్వచ్ఛంద సంస్థలు హర్షిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్వచ్ఛంద సంస్థలు, దేవాదాయ, ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలోనే జరిగిన అన్నదాన పథకాలు ప్రస్తుతం ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి ఐదు రూపాయలతో భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సహితం ప్రశంసిస్తున్నారు. 250 గ్రాముల భోజనం, ఒక కూర, సాంబరుతో కలిపి పేపర్ ప్లేట్లలో అందిస్తున్నారు. అంతేకాకుండా తాము ఇక్కడ తినలేమనే వారికి పార్శిల్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.
అయితే ఈ భోజనం విలువ మార్కెట్‌లో రూ. 40నుంచి 50ల వరకు ఉంటుంది. కోఠి, చింతల్‌బస్తీ, మెహిదీపట్నం, నాంపల్లి కేంద్రాలలో మధ్యాహ్నం అందించే ఐదు రూపాయల భోజనానికి విశేష స్పందన లభిస్తుంది. హైదరాబాద్‌కు చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు కూడా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని మహానగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. రోజూ వారీ కూలీలే కాకుండా నిరుపేదలు కూడా ఐదు రూపాయల భోజనంపై ఆధారపడుతున్నారని అధికారులు తెలిపారు. 50 కేంద్రాలతో 15వేల మంది పేదలకు భోజనం అందిస్తున్న ఈ పథకం వంద కేద్రాలకు విస్తరించి 30వేల మందికి ఆసరగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరో వంద కేంద్రాలు ఏర్పాటు చేసి 60వేల నిరుపేదల కడుపు నింపాలనే ప్రణాళికలు రూపొందించనున్నట్టు మహానగర పాలక సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని ప్రధాన కూలీ అడ్డాలు, ఆసుపత్రుల పరిసరాలు, వెనుకబడిన ప్రాంతాలు, దేవాలయాల పరిసరాల్లో ఐదు రూపాయల భోజన కేంద్రా ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మధ్యాహ్న భోజన పథకంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి, మరింత విస్తరించే కాంక్ష నెరవేరాలని కాంక్షిద్దాం.