రాష్ట్రీయం

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 13: పెరటాసి మాసం కావడం, విద్యార్థులకు దసరా సెలవులు ముగుస్తుండటం, వారాంతపు సెలవులు కూడా కలసి రావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. దీంతో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. ఎటుచూసినా క్యూలైన్లలో పిల్లాపాపలతో వేచి ఉన్న భక్తులే దర్శనమిస్తున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలలో భారీ వర్షం కురిసినా భక్తులు క్యూలైన్లలో తడుస్తూనే నిలబడి స్వామివారిపై ఉన్న అచంచల భక్త్భివాన్ని చాటుకున్నారు. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను వర్షంలో తడుస్తూనే సందర్శించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులకు అందించాల్సిన సౌకర్యాల గురించి వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. వర్షం కురిసిన నేపథ్యంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ వెలుపల సుమారు మూడు కిలోమీటర్ల దూరం క్యూలైన్లలో ఉన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శనివారం సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 51,171 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాల్లోని క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1, 2ల్లో, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు.
*చిత్రం...జోరు వర్షంలోనూ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు