రాష్ట్రీయం

సుజాత ఫస్ట్ - నారాయణ లాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. పార్టీని సమన్వయ పర్చుకోవడంతోపాటు శాఖల పనితీరును బట్టి ఈ ర్యాంకులిచ్చారు. ఒక ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడికి 79వ ర్యాంక్ రావడం గమనార్హం. గనులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంకు లభించింది. జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రెండో ర్యాంకు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మూడో ర్యాంకు, వైద్యవిద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌కు నాలుగో ర్యాంకు, పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీతకు ఐదో ర్యాంకు, షెడ్యూల్డ్ కులాలు, తెగల శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుకు ఆరో ర్యాంకు, కార్మిక మంత్రి అచ్చన్నాయుడుకి ఏడో ర్యాంకు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎనిమిదో ర్యాంకు లభించాయి. బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తొమ్మిదో ర్యాంకు, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడుకు పదో ర్యాంకు, సమాచార, పౌర సంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డికి 11వ ర్యాంకు, దేవాదాయ మంత్రి మాణిక్యాల రావుకు 12వ ర్యాంకు, గృహ నిర్మాణ మంత్రి మృణాలినికి 13వ ర్యాంకు లభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న మున్సిపల్ మంత్రి నారాయణకు 18వ ర్యాంకు లభించింది. 14, 15, 16వ ర్యాంకులను ఎవ్వరికీ మంజూరు చేయలేదు. ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి, రవాణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు ర్యాంకులు ఇవ్వలేదు. ఈ నలుగురు ఖాళీగా ఉన్న ఈ ర్యాంకులను సర్దుకోవాలి. పార్టీ కార్యక్రమాలు, శాఖల పనితీరును బట్టి ఈ ర్యాంకులిచ్చారు.
జిల్లా పార్టీ అధ్యక్షుల్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుకు మొదటి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి రెండో ర్యాంకు లభించాయి. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో పాలకొల్లుకు చెందిన నిమ్మల రామానాయుడికి మొదటి ర్యాంకు లభించింది. ఎమ్మెల్యేల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు మొదటి ర్యాంకు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుకు రెండో ర్యాంకు లభించాయి. చంద్రబాబుకు మాత్రం 79వ ర్యాంకు లభించడం గమనార్హం.
రాంకులపై నిరసన
ఈ ర్యాంకులు దేన్ని కొలమానంగా తీసుకుని ఇచ్చారన్నది మంత్రులకే అర్థంకావడం లేదు. ఈ ర్యాంకులపై ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానిస్తూ ఈ ర్యాంకులను తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘అసలు ముఖ్యమంత్రికి ఏ ర్యాంకు వచ్చింది? అంతా తానై పనిచేస్తున్నారు. తమపని తాము చేసుకుంటే శాఖలను ఇప్పటికే మెరుగుపరిచేవారం. ఎప్పుడూ సమీక్షా సమావేశాలతో కాలాన్ని వెళ్లబుచ్చడం వల్ల తాము ఎప్పుడు ఏ పని చేయాలో తెలియని స్థితికి చేరుకుంటున్నాం’ అని ఆ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. సోమవారం విడుదల చేసిన ర్యాంకులన్నీ గందరగోళంగా ఉన్నాయని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ‘కొన్ని శాఖల్లో అసలు పనే ఉండదు. ఆ శాఖ మంత్రికి అద్భుతమైన ర్యాంకు ఇవ్వడంలో ఆంతర్యమేమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘తనకు సన్నిహితంగా ఉన్న మంత్రులను కిందకు నెట్టేసి, పనిచేయకపోతే ర్యాంకింగ్ దారుణంగా ఉంటుందని చెప్పడమే చంద్రబాబు ఆంతర్యమా?’ అని ఆ మంత్రి ప్రశ్నించారు.
ఇదిలావుండగా జిల్లాలో పార్టీని బాగా సమన్వయం చేస్తున్న మంత్రులకు కూడా ర్యాంకులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో టిడిపిని బాగా సమన్వయం చేస్తున్న నారాయణకు మొదటి ర్యాంకు ఇచ్చారు. మంత్రిగా పనితీరు బాగోలేదని సిఎం సర్ట్ఫికెట్ ఇస్తే, పార్టీపరంగా నారాయణ భేష్ అనిపించుకోవటం గమనార్హం. మంత్రిగా పనితీరు బాగోలేదని జనమంతా అనుకుంటున్న వారిని తొలి వరుసలో నిలబెట్టడం సమంజసంగా లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.