రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కీచకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు 2015,2016 సంవత్సరంతో పోల్చితే 2017లో పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకటించింది. రెండేళ్ల ఆలస్యం తర్వాత ఎన్‌సీఆర్‌బీ దేశంలో నేరాలపై గణాం క వివరాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలను విశే్లషిస్తే 2015 లో 15,967, 2016లో 16,362, 2017లో 17,909 ఐపీసీ నేరాలు నమోదయ్యా యి. తెలంగాణలో 2015లో 15,425, 2016లో 15,374కు తగ్గి, 2017లో 17,521 ఐపీసీ నేరాలు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 2015లో 3,29,243 కేసులు, 2016లో 3,38,954 నేరాలు, 2017లో 3,59849 ఐపీసీ నేరాలు నమోదయ్యాయి.
ఎన్‌సీఆర్‌బీ వివరాల ప్రకారం తెలంగాణలో 2017లో మహిళల హత్య,రేప్ నేరాలు మూడు, వరకట్నం చావులు 251, మహిళలు ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు 501, యాసిడ్ దాడులు 1, మహిళల పట్ల భర్తలు, కుటుంబ సభ్యుల క్రూరప్రవర్తన నేరాలు 7838 నమోదయ్యాయి. మహిళల కిడ్నాపింగ్ కేసులు 934, డబ్బు కోసం కిడ్నాపింగ్ నేరాలు 10, పెళ్లి చేసుకోమని వత్తిడి తెస్తూ కిడ్నాపింగ్ చేసిన నేరాలు 239 రిజిస్టరయ్యాయి. లైంగిక దోపిడీ కింద 77 కేసులు, మహిళలపై అత్యాచారాల కేసులు 552 నమోదయ్యాయి. మహిళలపై అత్యాచార ప్రయత్నం కేసులు 38, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు 4409, మహిళలను అవమానించిన కేసులు 1160 నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2017 సంవత్సరంలో మహిళల హత్య, రేప్ కేసులు 6, వరకట్నం చావులు 152, మహిళలు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 597, యాసిడ్ దాడులు 2, మహిళల పట్ల భర్త, కుటుంబ సభ్యుల వేధింపు కేసులు 7156, మహిళల కిడ్నాపింగ్ కేసులు 712, డబ్బు కోసం కిడ్నాపింగ్ కేసులు 4, బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలని వేధించిన కేసులు 46, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న బాలికలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్భధించిన కేసులు 202, యువతులను లైంగిక దోపిడీ కింద నమోదైన కేసులు 42, అత్యాచారయత్నం కేసులు 175, రేప్ కేసులు 988, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 5129, మహిళలను అవమానించిన కేసులు 1998 నమోదయ్యాయి.
అత్యాచార కేసులో మధ్యప్రదేశ్ ఫస్ట్
దేశం మొత్తం మీద మహిళలపై అత్యాచారం కేసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యాయి. 2017లో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 32559 కేసులు నమోదయ్యాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో 5562 కేసులు, యూపీలో 4246 కేసులు, రాజస్థాన్ రాష్ట్రంలో 3305 కేసులు, ఒడిశాలో 2070, కేరళలో 2003 కేసులు, మహారాష్టల్రో 1933 కేసులు, చత్తీస్‌ఘడ్‌లో 1908 కేసులు, అస్సాంలో 1778 కేసులు, హర్యానాలో 1099 కేసులు, పశ్చిమబెంగాల్‌లో 1084 కేసులు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 59, అస్సాంలో 1772 కేసులు, మిహార్‌లో 605, గోవాలో 76, గుజరాత్‌లో 477, హిమాచల్ ప్రదేశ్‌లో 249, కర్నాటకలో 546, మణిపూర్‌లో 40 కేసులు, మేఘాలయలో 119 కేసులు, మిజోరాంలో 25, నాగాలాండ్‌లో 10 కసులు, పంజాబ్‌లో 530, త్రిపురలో 95, సిక్కింలో 17, ఉత్తరాఖండ్‌లో 374 కేసులు నమోదయ్యాయి. 2018లోనే నేషనల్ రికార్డ్సు బ్యూరో 2017 కేసులు విడుదల చేయాల్సి ఉంది. కాగా రెండేళ్ల జాప్యం తర్వాత 2017 సంవత్సరంలోని నేర గణాంక వివరాలను ఆ ఏజన్సీ విడుదల చేసింది.