రాష్ట్రీయం

పేలిన మందుపాతర: సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 18: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు సిఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. సుకుమా జిల్లా ఎఎస్పీ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం చింతకుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని 74వ సిఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు రోడ్డు ఓపెనింగ్ పార్టీతో చింతకుప్ప- బుర్గాపాల్ గ్రామాల మధ్య కూంబింగ్ చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై పోలీసులు కాలు మోపడంతో పేలిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అర్జున్‌రామ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇన్‌స్పెక్టర్ రవిసింగ్, మరో కానిస్టేబుల్ ఎస్ బాబుకు స్వల్ప గాయాలయ్యాయని ఎఎస్పీ తెలిపారు. గాయపడిన జవాన్లను హెలికాఫ్టర్ ద్వారా జగదల్‌పూర్ వైద్యశాలకు తరలించినట్టు ఆయన తెలిపారు.