రాష్ట్రీయం

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, ఏప్రిల్ 18: తెలుగు రాష్ట్రాల వినతిమేరకు శ్రీశైలం జలాశయం నుంచి మరో నాలుగు టిఎంసిల నీటి విడుదలకు కృష్ణానది జలాల యాజమాన్య బోర్డు అనుమతించినట్లు శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఇ రాంబాబు తెలిపారు. గత 14 రోజుల నుంచి ఆనకట్ట రివర్స్ స్లూయిస్ గేట్ ద్వారా విడుదల చేస్తున్న నీటిని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం ఆరున్నర టిఎంసిల నీటి విడుదలకు అనుమతి రావడంతో కరెంటు ఉత్పత్తిద్వారా 1.71 టిఎంసిల నీటిని విడుదల చేశారు. జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోవడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ప్రకంపనలు రావడంతో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈనెల ఐదో తేదీన రివర్స్ స్లూయిస్ గేట్‌ను 10 అడుగుల మేర ఎత్తి సుమారు ఆరు టిఎంసిల నీటిని సోమవారం వరకు విడుదల చేశారు. రివర్ బోర్డు అనుమతించిన నీటిలో ఇంకా రెండున్నర టిఎంసిలు మాత్రమే మిగిలి ఉంది. సోమవారం సాయంత్రానికి జలాశయంలో నీటిమట్టం 885 అడుగులకుగాను 780 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలకుగాను 22.71 టిఎంలుగా ఉంది. రివర్స్ స్లూయిస్ గేట్ ద్వారా 5864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.