రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న రణబీర్, దీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: ప్రముఖ బాలీవుడ్ నటులు దీపికాపడుకొనె, రణబీర్ సింగ్‌లు గురువారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరు వివాహం చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వాదం పలికారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. అక్కడ నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న దీపికాపడుకొనే దంపతులకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా ఈ జంటను చూడటానికి భక్తులు ఆసక్తి కనబరిచారు.
*చిత్రం...తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వస్తున్న బాలీవుడ్ నటులు దీపికాపడుకొనె, రణబీర్ సింగ్