రాష్ట్రీయం

గుంటూరులో ఆలయం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి హిందూ దేవాలయాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. దీంతో భక్తులు, స్థానికులు తీవ్రస్థాయిలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న కొల్లిశారదా మార్కెట్ ఎదురుగా ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని కూల్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం అర్ధరాత్రి తరలి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి హైవేవరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆలయాన్ని కూల్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. గతంలో రెండుసార్లు ఆలయాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కుతగ్గారు. అయితే బుధవారం అర్ధరాత్రి ఆకస్మికంగా పొక్లయినర్‌లు, ఇతర సామగ్రితో ఆలయాన్ని కూల్చివేసేందుకు వెళ్లగా అక్కడి స్థానికులు, భక్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. అసలే ఆ ప్రాంతం సున్నితమైనది కావడంతో అధికారులు వేగంగా స్పందించి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయానికి మరో ప్రాంతంలో స్థలం ఇస్తామని, రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని తొలగించాల్సి వస్తుందని నరగపాలక సంస్థ అధికారులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆలయం కట్టిన తర్వాతే తొలగించాలని స్థానికులు భీష్మించడంతో తిరిగి ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులు రోడ్డుపై బైఠాయించి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలా ఉంటే కొంతమంది ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయంపై కచ్చితమైన హామీ ఇచ్చారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై ఆలయాన్ని కూల్చివేశారు. ఇలా ఉంటే ఆలయం కూల్చివేతపై హిందూ ధర్మా పరిరక్షణ సమితి తీవ్రంగా స్పందించింది. సమితి అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలోని పట్ట్భాపురం, డొంకరోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ జరిగిందని, అయితే ఇప్పటికీ అక్కడ ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను అధికారులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అధికారులకు హిందూ దేవాలయాలంటే చులకన భావం ఏర్పడిందన్నారు. ఆలయం తిరిగి నిర్మించే వరకు పోరాటం చేస్తామన్నారు. దీనిపై త్వరలో ధర్మదీక్ష చేపడతామని, ఈ విషయాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
*చిత్రం... కూల్చివేసిన ఆలయం శిథిలాలు