రాష్ట్రీయం

పీఎఫ్ కమిషనర్‌తో ఆర్టీసీ అధికారుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధి(పీఎఫ్)కి చెల్లించాల్సిన బకాయిలు దాదాపురూ. 1,660 కోట్లు ఉన్నాయి. ఈ మేరకు ప్రాంతీయ భవిష్యనిధి (పీఎఫ్) కమిషనర్ రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులకు నోటీసులు పంపించారు. నోటీసులకు స్పందించిన ఆర్టీసీ అధికారులు పీఎఫ్ కమిషనర్ ముందు హాజరు అయ్యారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధికి బకాయిలు దాదాపు రూ.760 కోట్లు, ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు దాదాపురూ. 900 కోట్లు బకాయిలు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. తెలంగాణ అధికారులు బకాయిలను చెల్లించడానికి గడువుకోరారు. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాత్రం బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని కమిషనర్‌కు తెలిపారు.