రాష్ట్రీయం

వికీపీడియాలో తెలుగు సమాచారం పెంచుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: వికీపీడియాలో సమగ్ర సమాచారం కోసం కోట్లాది మంది ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా వికీపీడియాలో సమాచారం ఎక్కువగా ఇంగ్లీషులోనే లభ్యమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వికీపీడియా ద్వారా సమారాన్ని సమగ్రంగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఇక్కడి ఐఐఐటీ ప్రాంగణంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ‘వికీపీడియాలో సమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి’ అంశం పేరుతో జరిగిన సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయి. వికీపీడియాలో తెలుగులో సమాచారం లభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ‘సముదాయాల అభివృద్ధి’, ‘సమాచార లభ్యత’, ‘శిక్షణ-అవగాహన’, ‘సాంకేతికత’, ‘పరిశోధన’ అనే ఐదు విభాగాల కింద ప్రయత్నాలు జరగాలని సదస్సులో స్థూలంగా ఒక అవగాహనకు వచ్చారు.
నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై అధారపడతారని, ప్రతి సెకనుకు సుమారు ఎనిమిది వేల మంది వికీపీడియాను సందర్శిస్తారని ఐఐఐటి ఆచార్యులు వాసుదేవ వర్మ పేర్కొన్నారు. వికీపీడియాపై జరిగిన సదస్సును వర్మ ప్రారంభిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా మాట్లాడే 25 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలున్నాయన్నారు. వికీపీడియాలో లభ్యమయ్యే సమాచారంలో ఇంగ్లీషుతో పోలిస్తే భారతీయ భాషల్లో కేవలం 2 శాతం లోపు మాత్రమే సమాచారం లభ్యమవుతోందన్నారు. వికీపీడియాలో తెలుగు సమాచారం పెంచేందుకు స్వీడన్ వికీపీడియా తరహాలో సమిష్టి కృషి అవసరమన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాలను వికీపీడియాలో పొందుపరిచేందుకు అనుమతించామని భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పొందుపరిచే ప్రయత్నంలో భాష, సాంస్కృతిక శాఖ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. డిజిటల్ మీడియా వేదికలలో తెలుగు వాడకాన్ని పెంచేందుకు ఐటీ శాఖ కృషి చేస్తోందని డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు దిలీప్ కొణతం తెలిపారు. ఇప్పటి వరకు తెలుగులో వికీపీడియా ద్వారా సమాచారాన్ని అందించేందుకు జరిగిన ప్రయత్నం బాగానే ఉందని, భవిష్యత్తులో రెట్టించిన ఉత్సాహంతో తెలుగు వికీపీడియా అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు. ఐటీ శాఖ ఈ దిశలో సహకారం అందిస్తుందని దిలీప్ హామీ ఇచ్చారు. వికీపీడియా నియమాలను అనుసరిస్తూ, తెలుగులో సమాచారాన్ని పొందుపరిచేందుకు శిక్షణా తరగతులు అవసరమని, ఈ తరహా శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని వికీపీడియా ప్రతినిధి వీవెన్ తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ సహాయ సంచాలకులు మాధవ్ ముడుంబై, రాధిక మామిడి, కృపాల్ కశ్యప్, కూర్మనాథ్, ప్రణయ్ రాజ్, చిట్టిపంతులు, కట్టాశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...వికీపీడియాలో సమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి’ అంశం పేరుతో జరిగిన సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు