రాష్ట్రీయం

సత్యసాయి జయంతి వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 18: భగవాన్ సత్యసాయి బాబా 94వ జయంతి వేడుకలు సోమవారం పుట్టపర్తిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల ప్రారంభం రోజు సోమవారం సంప్రదాయ పద్దతిలో శ్రీవేణుగోపాలస్వామి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం ప్రశాంతి నిలయం, సాయి కుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహా సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ్ధర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డా. హరికృష్ణ, ట్రస్ట్ సభ్యులు, దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సాయి భక్తులు వేలాదిగా వేడుకల్లో పాల్గొన్నారు. గోపురం గేటు వద్ద ఉంచిన ప్రత్యేక రథంపై ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉంచారు. హనుమాన్ పల్లకి ముందు సాగగా సాయి భక్తకోటి, ట్రస్ట్ పరివారం వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని ముందుకు సాగించారు. పురవీధుల్లో పూలవర్షం కురిపిస్తూ సాయి నామస్మరణలతో పుట్టపర్తి వీధులు మారుమోగాయి. భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పిస్తూ భక్తిని చాటుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20, 21న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం జరుగుతాయి. 23వ తేదీ సత్యసాయి జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ గవర్నర్ తమిళసై సుందర్‌రాజన్, కేంద్ర మంత్రి నితిన్ గట్కారి హాజరవుతారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి ఆశయాలను కొనసాగించేందుకు ట్రస్ట్ కృషనిశ్చయంతో ఉందన్నారు. ఆయన చూపిన మార్గంలో సుమారు 150కు పైగా దేశాల్లో సాయి భక్తులు విశేష సేవలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, ప్రసాద్‌రావు, నరేంద్రనాథ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం, ప్రముఖులు పాల్గొన్నారు.

*చిత్రం... పుట్టపర్తిలో వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం