రాష్ట్రీయం

25న పీఎస్‌ఎల్‌వీ-సి47 రాకెట్ ప్రయోగానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 19 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 25వ తేది పిఎస్‌ఎల్‌వి సి-47 ర్యాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మొదటి ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈనెల 25వ తేది ఉదయం 9గంటలకు నిప్పులు చిమ్ముతూ గగనంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి 24వ తేది ఉదయం కౌంట్‌డౌన్ ఆరంభం అవుతుందని షార్ వర్గాలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన మూడవ తరం కార్టోశ్యాట్ 3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన మరో 13నానో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి. అంతరిక్షం నుంచి భూమి ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగించే కార్టోశ్యాట్ 3 ఉపగ్రహం అధిక రిజల్యూషన్ ఇమేజ్ సామర్ధ్యాన్ని కలిగివుంటుందని షార్ వర్గాలు తెలిపాయి. . షార్ నుంచి ప్రయోగించిన రాకెట్‌లో ఇది 74వ ప్రయోగ వాహన మిషన్ అవుతుందని వారు పేర్కొన్నారు.