రాష్ట్రీయం

వరంగల్ నిట్‌లో 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 23: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శనివారం నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల 11మంది నిట్ కళాశాల విద్యార్థులు నిట్ క్యాంపస్‌లోని దాసా హాస్టల్ గదిలో సిగరెట్‌లో గంజాయి కలిపి సేవిస్తుండగా నిట్ సెక్యూరిటీ అధికారులు పసిగట్టి పట్టుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నిట్ అధికారులు అందుకు బాధ్యులైన 11 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే సస్పెండ్‌కు గురైన 11మంది విద్యార్ధుల్లో తొమ్మిది మంది విదేశీ విద్యార్ధులే ఉన్నారు. నిట్ క్యాంపస్‌లో విదేశాలకు చెందిన విద్యార్ధులకు 1.8కే నెంబర్ హాస్టల్ కేటాయిస్తారు. ఈ హాస్టల్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.