రాష్ట్రీయం

శ్రీవారి సేవకుని కుటుంబానికి ఆర్థికసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 23: తిరుమలలో శ్రీవారి సేవకు వచ్చి ప్రమాదవశాత్తూ గాయపడి మృతిచెందిన శ్రీవారి సేవకుని కుటుంబానికి టీటీడీ చైర్మన్ ఏడులక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని శనివారం అందించారు. తిరుమల శ్రీవారి సేవకు వచ్చిన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మోతే సుమన్ సేవా సదన్ పైఅంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి రూ. 7లక్షలు ఆర్థిక సాయాన్ని మృతుని తల్లి మోతే ఓదెమ్మకు శనివారం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గతేడాది జూన్ 23వ తేదీ పరకామణి సేవలో పాల్గొనేందుకు సుమన్ వచ్చాడన్నారు. రెండు రోజులు సేవ చేసిన అనంతరం శ్రీవారి సేవకులు బసచేసే సేవా సదన్ పై అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడనీ, సుమన్ ప్రాణాలను కాపాడేందుకు స్విమ్స్ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని అయితే దురదృష్టవశాత్తు మృతి చెందాడన్నారు. తాను స్విమ్స్‌లో సుమన్‌ను పరామర్శించడానికి వెళ్లినప్పుడు అక్కడ అతనితోపాటు సేవకు వచ్చిన ఇద్దరు యువకులు మాత్రమే ఉన్నారనీ, సుమన్ తల్లి, అన్న ఉన్నప్పటికీ కరీంనగర్ నుంచి రావడానికి బస్ చార్జీలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నట్లు తెలిసిందన్నారు. కరీంనగర్‌లో తనకు తెలిసిన వారితో ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి సుమన్ తల్లిని తిరుపతికి రప్పించానన్నారు. కుటుంబాన్ని పోషిస్తున్న సుమన్ మృతితో అతని తల్లి ఓదెమ్మ జీవనం గగనంగా మారడంతో ఆర్థికసాయం అందించేందుకు బోర్డు సభ్యులతో చర్చించానన్నారు. అందరూ సానుకూలంగా స్పందించడంతో టీటీడీ తరపున ఇన్సురెన్స్‌తో కలిపి రూ. 5 లక్షలు అందించామన్నారు. అలాగే బోర్డు సభ్యులు సుధా నారాయణ మూర్తి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒక్కొక్కరు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పిఆర్వో డాక్టర్ తలారి రవి, ఏపిఆర్వో, శ్రీవారి సేవ విభాగం ఓఎస్డీ పి.నీలిమ పాల్గొన్నారు.
*చిత్రం... తిరుమలలో మృతి చెందిన కరీంనగర్ వాసి సుమన్ తల్లికి ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి