రాష్ట్రీయం

గోదావరికి హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 24: కార్తీక మాస ఆదివారం పవిత్ర దినాన రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి, ఉత్తరాఖండ్ సంపూర్ణానంద బ్రహ్మచారి మహరాజ్ స్వామి, చండీ ఉపాసకులు పాలెం మనోహర శర్మ సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో దీనిని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో ముందుగా బాసరకు చెందిన రుషి కన్యలు నామాంకితుల ద్వారా ఏవం వేదా అంటూ
మహిళల మంత్రోచ్ఛారణల మధ్య నదీ పూజాదికాలలో స్వాములు పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించారు. వీహెచ్‌పీ, ఆరెస్సెస్, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, గోదావరి హారతి నిర్వాహకులు వీరగోపాల్, రాంసుధాకర్, పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ జీవనధార, దక్షిణ గంగానది గోదావరిని పరిరక్షించడానికి శపథం చేయాలని మురళీధర్‌రావు ఈ సందర్భంగా కోరారు.

*చిత్రం... ధర్మపురిలో గోదావరికి మహా హారతి ఇస్తున్న రామానుజ చినజీయర్ స్వామి, పండితులు