రాష్ట్రీయం

అనంతుని కొండ మెట్ల కోటి దీపాల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోస్తని నదీ తీరాన్న ఉన్న విశాఖ జిల్లా అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం సాయంత్రం అనంతుని కొండ మెట్ల కోటి దీపాల ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. కార్తీకమాసం చివరి రోజు కార్తీక బహుళ అమావాస్య నాడు అనంతుని సన్నిధిలో కోటి దీపాలు ఉత్సవం నిర్వహించడం పూర్వం నుంచీ వస్తున్న సంప్రదాయం. కొండ దిగువన కుంతీ మాధవస్వామి, కొండ మొదటి పావంచా వద్ద నారాయణేశ్వురుని ఆలయాలు కొండ మెట్ల కోటి దీపాల ఉత్సవం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 2 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారని అంచనా