రాష్ట్రీయం

ఎవరు వెళ్లినా నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : జనసేన పార్టీని ఎవరు వీడినా నష్టం లేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ఆదరించే మహిళలు, అండగా నిలిచే అభిమానులు ఉన్నంతకాలం పటిష్టంగానే ఉంటుందని అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విజయవాడ తూర్పు నియోజకవర్గ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భావజాలం కలవనప్పుడు వ్యక్తులు విడిపోతారని, ఇష్టంతో ఉండాలేతప్ప బలవంతంగా ఉండాలని ఎవరికీ చెప్పబోమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్న వారెవ్వరూ పార్టీ పెట్టిన తొలినాళ్లలో లేరని గుర్తుచేశారు. కార్యకర్తలతో సమావేశమై క్షేత్రస్థాయిలో పనిచేసేవారి వివరాలను తెలుసుకుంటున్నామన్నారు. చిరుద్యోగులు, వ్యాపారులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, తన భావజాలం వారికి అర్థమైనందునే అంటిపెట్టుకుని ఉంటున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఎన్నో ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ఆయన పార్టీలోకి రావడానికి ముందు ఏడాది పాటు ఇద్దరం అనేక విషయాలపై చర్చించుకున్నామన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీయని రాజకీయాలే చేయాలని, ప్రాంతాలు, మతాలుగా విభజించే రాజకీయం చేయకూడదని ఆనాడే నిర్ణయించుకున్నామని, అందుకే ఆయన అంటే తనకు గౌరవమన్నారు. పార్టీని, తనపై ఆధారపడిన కుటుంబాలు, తన కుటుంబాన్ని పోషించుకోడానికే సినిమాలు చేస్తున్నానుతప్ప ఇష్టంతో కాదన్నారు. అడ్డదారుల్లో వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించబోనని స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వార్థం, లాభం చూసుకుంటే తాను పార్టీని పెట్టేవాడినేకానని, బీజేపీలో చేరి పదవులు అనుభవించే వాడినని పవన్ అన్నారు. ఎవరైనా పార్టీలో ఇష్టంతో ఉండాలేతప్ప బలవంతంగా ఎంతోకాలం ఉంచలేమని, పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో, లేదోకూడా అర్థంకావడం లేదని వాపోయారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెంట చాలామంది మేధావులు నడిచారని, మనకు మేధావుల సమూహం లేదన్నారు. ఓపిక, సహనంతో రాజకీయాలు చేసినప్పుడే విజయాలు సాధించగలమని పవన్‌కళ్యాణ్ వివరించారు.
*చిత్రం...కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జనసేనాని పవన్‌కళ్యాణ్