రాష్ట్రీయం

దత్తత.. ఉత్తిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరవు గ్రామాలను ఆదుకుంటామంటారు..వెనుకబడిన వాటిని దత్తత తీసుకుంటామంటూ సభ్య సమాజం సాక్షిగా చెబుతారు. ఇంకేముంది..తమ చేతుల్లో పడితే దత్తత గ్రామాల భవితే మారిపోతుందన్న ఆశల పందిళ్లు కట్టిస్తారు. కానీ..అవి మాటల వరకే..ఇప్పటి వరకూ సినీ నటులు, రాజకీయ నాయకులు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి అంగుళం కదిలితే ఒట్టు..అక్కడి ప్రజల కడగళ్ల సాక్షిగా ఇదీ చేదు నిజం..దత్తత గ్రామాల దుస్థితిని చూసిన ఎవరికైనా వాటి అభివృద్ధి మాటలతో సరేనా అన్న భావన కలుగక మానదు..సమస్యల లోగిలిగా మారిన ఆ గ్రామాన్ని ఓ ప్రముఖుడు ‘దత్తత’ తీసుకున్నాడు. అంతే...దానికి ఎక్కడ లేని ప్రచారం లభించింది. అభివృద్ధి హామీలు ఉక్కిరి బిక్కిరి చేసాయి. అధికార యంత్రాంగమూ పరుగులు పెట్టింది. గ్రామస్థుల ఆనందానికి ఆకాశమే హద్దయింది. విద్య, వైద్యం, మంచినీరు, సాగునీరు, ఉపాధి, రహదారులు వచ్చేస్తాయని ఆశించారు. కానీ అవన్నీ అడియాసలే అయ్యాయి. దత్తత తీసుకున్న ప్రముఖులు మాటలకే పరిమితమయ్యారు.
ఆ తర్వాత తమవైపు కనె్నత్తి కూడా చూడకపోవడంతో దత్తత ఉత్తుత్తిదే అనే భావం గ్రామస్థుల్లో స్థిరపడింది. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, రాష్టమ్రంత్రులు, సినీ ప్రముఖులు ఫలానా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని ప్రకటించి చాలా కాలమైంది. ఎంతో ఆర్భాటంగా ఓ ప్రహసనంగా మారిన దత్తత స్వీకార ప్రకటనలు అప్పట్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. దత్తత తీసుకోబడిన గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండడం గమనార్హం. వౌలిక వసతుల మాట దేవుడెరుగు...మండువేసవిలో గొంతు తడుపుకునే దిక్కులేక బిందెలతో మైళ్లకొద్దీ దూరం వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా ఎలాంటి మార్పులేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకున్న నర్సన్నపేట గ్రామంలో స్వయంగా ఆయన పూనుకుంటేనే గాని నీటి కష్టాలు తీరలేదు. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధుల మధ్య కొరవడిన సమన్వయం దత్తత గ్రామస్థులకు కష్టాల్నే మిగులుస్తున్నాయి. దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ‘ఆంధ్రభూమి’ వరుస కథనాలు నేటినుంచి....

చిత్రం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో మోటార్ వద్ద మహిళల నీటిపాట్లు.