రాష్ట్రీయం

ఇక బిసిలకూ కల్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21:ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వర్తిస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఇకపై బిసిలకూ వర్తిస్తుంది. వివాహ సమయంలో బిసి అమ్మాయికి కల్యాణలక్ష్మి పథకం కింద 51వేల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బిసిలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారికీ ఈ పథకం వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 18 ఏళ్ల వయసు నిండిన బిసి/ ఇబిసిలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి బిసి, ఇబిసిలకు ఈ పథకం వర్తిసుందని ఉత్వర్వుల్లో తెలిపారు. ఈ పథకానికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీని నిర్థారించే సర్ట్ఫికెట్, కుల సర్ట్ఫికెట్, ఆదాయ ధ్రువపత్రం అందజేయాల్సి ఉంటుంది. దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ పథకానికి ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేశారు.