రాష్ట్రీయం

నీళ్లు అడుగంటాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21:తెలంగాణలో రాష్టవ్య్రాప్తంగా అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరస్థాయిలో పడిపోయాయి. రాష్ట్రంలో గత సీజన్‌లో 25 శాతం తక్కువగా వర్షపాతం తక్కువగా నమోదుకావడంవల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. సాధారణ వర్షపాతం 862 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 212 మిల్లీమీటర్లు తక్కువగా అంటే 650 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 127 మండలాల్లో భూగర్భ జల మట్టాలు పాతాళానికి చేరాయి. ఇక్కడ 20 మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో 35 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మండలాలు, నల్లగొండ జిల్లాలో 22 మండలాలు, నిజామాబాద్ జిల్లాలో 15 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 12 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
146 మండలాల్లో నీటిమట్టాలు పది నుంచి ఇరవై మీటర్ల లోపు పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 30 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 20, నల్లగొండ జిల్లాలో 20, వరంగల్ జిల్లాలో 19 మండలాలు, రంగారెడ్డి జిల్లాలో 13 మండలాలు, నిజామాబాద్ జిల్లాలో 12 మండలాలను ఈ కేటగిరీలో చేర్చారు. 101 మండలాల్లో ఐదు నుంచి పది మీటర్ల లోపు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా నీటి మట్టాలు పెరగలేదు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని విశే్లషిస్తే మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో నీటి మట్టాలు మరింత లోతుకు వెళ్లడం ఖాయమని తేల్చారు. రాష్ట్రం మొత్తం మీద సగటు భూగర్భ జల నీటి మట్టం నిరుడు 12.27 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 14.88 మీటర్లకు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో 8.25 మీటర్ల నుంచి 20.36 మీటర్లకు, దరూర్ మండలంలో 7.18 మీటర్ల నుంచి 39.06 మీటర్లకు నీటి మట్టాలు పాతాళానికి చేరుకున్నాయి. మెదక్ జిల్లాలో శివంపేట మండలంలో 14.70 మీటర్లకు, నంగనూరులో 18 మీటర్లకు, నిజామాబాద్ జిల్లా మక్లూరులో 13.40 మీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూరులో 28.23 మీటర్లకు పడిపోయాయి.