రాష్ట్రీయం

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 22: తిరుపతిలో ఇటీవల కాలం వరకు 42 డిగ్రీల ఉష్ణతాపంతో ఉడికి పోయిన ప్రజలకు శుక్రవారం అరగంటపాటు చిరు జల్లులు కురిసి ఊరట నిచ్చాయి. అదే సమయంలో బీభత్సమైన గాలితోడుకావడంతో కొంత భయకంపితులైయ్యారు. ఎక్కడ ఏ విద్యుత్ వైర్లు తెగి నెత్తిన పడతాయో, చెట్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కూలుతాయోనని పాదచారులు, వాహన చోధకులు భయభ్రాంతులకు గురైయ్యారు. తిరుపతిలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురుస్తుందని అందరూ భావించారు. అయితే తుంపర్లు మొదలైయ్యాయి. అది కాస్త పెద్ద చినుకులుగా మారాయి. మరుక్షణంలో బీభత్సమైన ఈదురు గాలులు వర్షపు చినుకులను సైతం మాయం చేశాయి. బలమైన గాలుల ధాటికి నగరంలో పలుచోట్ల చెట్లు, భారీ ఫ్లెక్సీలు నేలకూలాయి. విద్యుత్ స్థంబాలు నేలవాలాయి. దీంతో నగరంలో విద్యుత్ సరఫరాకు గంటపాటు అంతరాయం కలిగింది. అయితే వెంటనే స్పందించిన విద్యుత్, నగరపాలక సంస్థ అధికారులు గాలి హోరు తగ్గగానే నేల కూలిన చెట్లును తొలగించగానే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పలుచోట్ల భవనాలపై ఏర్పాట్లు చేసిన భారీ ఫ్లెక్సీలు తెగిపోయి గాలి ధాటికి పెను శబ్దాలను సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. కాగా స్థానిక శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్న తేరుకు చుట్టు ఏర్పాటు చేసిన రేకులు కొన్ని గాలికి ఎగిరి కిందపడ్డాయి. అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. వెంటనే స్పందించిన టిటిడి ఇంజినీరింగ్ అధికారులు వాటిని తొలగించారు.
కూనవరం మండలంలో ..
కూనవరం: తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన కూనవరం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మండలంలోని గొమ్ము అయ్యవారిగూడెం గ్రామం తీవ్రంగా నష్టపోయింది. శుక్రవారం సాయంత్రం భీకరమైన గాలులు వీయడం, వడగళ్ల వాన కురవడంతో, గ్రామంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. సుమారు 30 కుటుంబాలున్న ఆ గ్రామంలో 10 ఇళ్లపై చెట్లు విరిగి పడగా తీవ్ర నష్టం వాటిల్లింది. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి.

chitram తిరుపతిలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నేలకూలిన చెట్టు