రాష్ట్రీయం

ఆర్డీఎస్‌పై వివాదాలకు అడ్డుకట్ట వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23:కర్నాటక- తెలంగాణ మధ్య ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈనెల 28న బెంగళూరు వెళ్లనున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సాగునీటి ప్రాజెక్టులపై ఏళ్లతరబడి నెలకొని ఉన్న వివాదాల పరిష్కారానికి నడుం బిగించిన తెలంగాణ సర్కార్, మహారాష్టత్రో చర్చలను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నాటకపై దృష్టి సారించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్‌డిఎస్ సమస్యపై ఈనెల 28న కర్ణాటకతో చర్చలు జరపనుంది. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబి పాటిల్‌తో మంత్రి తన్నీరు హరీశ్‌రావు బెంగళూరులో భేటీ అవుతారు. అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ వివిధ కారణాలతో తెలంగాణ రైతులకు నీరు అందించలేకపోతున్నదని హరీశ్‌రావు కర్నాటక మంత్రికి ఫోన్‌లో వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 15.9 టిఎంసిల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు ఆర్డీఎస్ నుంచి సాగునీటిని అందించాల్సి ఉండగా, ఐదు నుంచి ఆరు టిఎంసిల నీరు కూడా రావడం లేదని మంత్రి తెలిపారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఏనాడూ 20వేల ఎకరాలకు కూడా సాగునీరు నోచుకోలేదని అన్నారు. కృష్ణానది కర్నాటకలో 40 కిలోమీటర్లు ప్రవహించిన తరువాత ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కర్నూలు రైతులు తరచుగా తూములు పగులగొట్టడం, కర్నాటక రైతులు ఆక్రమంగా నీటిని తరలించుకొని పోవడం వంటి సమస్యలతో ఆర్‌డిఎస్ ద్వారా రావలసిన నీరు రావడం లేదని హరీశ్‌రావు తెలిపారు. ఆర్‌డిఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెంటీమీటర్లు పెంచడానికి, లైనింగ్ మరమ్మతులకు సంబంధించి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 72 కోట్ల రూపాయలు మంజూరు చేసి, అందులో 58 కోట్లను కర్నాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిందని హరీశ్‌రావు తెలిపారు. బ్యారేజీ సైట్ కర్నాటక భూ భాగంలో ఉన్నందున ఈ డబ్బును డిపాజిట్ చేసినట్టు చెప్పారు. హరీశ్ ప్రతిపాదనలకు కర్నాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈనెల 28న బెంగళూరుకు రావాలని కర్నాటక మంత్రి పాటిల్, హరీశ్‌రావును ఆహ్వానించారు.