రాష్ట్రీయం

గ్రూప్-2లో మరో 300 పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నిర్వహించనున్న గ్రూప్-2 నియామకాల్లో ఖాళీల సంఖ్య మరో 300 పెరిగింది. గతంలో ఉన్న 439 పోస్టులతో కలుపుకుంటే ఈ సంఖ్య 739కి పెరిగింది. ఇందుకు సంబంధించిన పరిపాలనాపరమైన ప్రక్రియ మొదలైందని సమాచారం. ఇప్పటికే గుర్తించిన కొత్త ఖాళీల జాబితాను రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించింది. జింబాబ్వే పర్యటనలో సిఎస్ రాగానే ఆమోద ముద్ర వేస్తారని అంటున్నారు. గత నెల 24, 25 తేదీల్లో గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి సన్నాహాలు చేసింది. అయితే అభ్యర్ధుల కోరిక మేరకు చివర్లో పరీక్షలు వాయిదా పడ్డాయి. పనిలో పనిగా తదుపరి పరీక్ష నిర్వహణ వరకూ ఏర్పడే కొత్త ఖాళీలను సైతం ఈ నోటిఫికేషన్‌లోనే చేర్చాలని ప్రభుత్వం భావించడంతోపాటు ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సైతం శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు పెరిగిన ఖాళీల సంఖ్యతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా, డివిజన్ స్థాయిలో ఖాళీగా ఉన్న కీలకమైన పోస్టుల వివరాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఇటీవలే రెవిన్యూ విభాగానికి పంపించారు. జిల్లా కలెక్టర్లు పంపించిన లిస్టుల్లో ఎక్కువగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. జెడ్పీ సిఇఓలు, డిఆర్‌డిఎ పిడిలు, ఎస్సీ బిసి కార్పొరేషన్ల ఇడిలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లు, డిపిఓ తదితర పోస్టులున్నాయి.