రాష్ట్రీయం

ఎస్‌ఆర్‌డిపి పనులు ఆరంభించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ మహానగర విస్తరణ, భవిష్యత్తు అవసరాలు, ట్రాఫిక్ జామ్‌ల నివారణ కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎస్‌ఆర్‌డిపికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణం పనులు ప్రారంభించాలని తెలంగాణ మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఎస్‌ఆర్‌డిపి పనుల పురోగతిపై కెటిఆర్ శనివారం సమీక్షించారు. జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులతో పాటు ట్రాఫిక్, ట్రాన్స్‌కో, జల మండలి, ఫారెస్ట్ అధికారులతో ప్రతి వారం సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశంలో తానూ పాల్గొంటానని కెటిఆర్ తెలిపారు. పలు చోట్ల అనుమతులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. జలమండలి సియండి దానకిశోర్, ట్రాన్స్‌కో సియండి రఘుమారెడ్డిలతో కెటిఆర్ ఫోన్‌లో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వాలని కోరారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని మంత్రి తెలిపారు. వేగంగా, నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు ఉండాలని కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ఇప్పటికే తాము భూ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వంతెనల నిర్మాణానికి అవసరమైన ఫ్రీ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎస్‌ఆర్‌డిపి పనుల సమన్వయానికి, పరిశీలనకు ప్రత్యేక ప్రాజెక్టు ఇంప్లీమెంటేషన్ యూనిట్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. దీనికి అవసరమైతే కన్సల్టెంట్లను నియమించుకోవాలని తెలిపారు.
మైండ్ స్పేస్ సమస్య తీరింది
మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత యస్‌ఆర్‌డిపి పనులకు అవాంతరాలు తొలిగిపోయాయి. వచ్చే ఆరునెలల్లో అక్కడ అండర్ పాస్ నిర్మాణం పూర్తవుతుందని, దీంతో అక్కడ ట్రాఫిక్ పరిస్థితి మెరుగు పడుతుందని కెటిఆర్ చెప్పారు. సమావేశంలో ఎల్‌అండ్‌టి, జిహెచ్‌ఎంసి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అండర్ పాస్ నిర్మాణం పనులు సోమవారం నుంచి ప్రారంభించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మున్సిపల్ అధికారులతో పాటు ఎల్ అండ్ టి మెట్రోరైలు సియండి గాడ్గిల్ పాల్గొన్నారు.

చిత్రం శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న టి.మంత్రి కెటిఆర్